Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ క్రేజీ మూవీ.. సీక్వెల్ ప్లాన్ లో డైరెక్టర్

‘పెళ్లి చూపులు’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’.

By:  Tupaki Desk   |   5 Nov 2024 8:43 AM GMT
విశ్వక్ సేన్ క్రేజీ మూవీ.. సీక్వెల్ ప్లాన్ లో డైరెక్టర్
X

‘పెళ్లి చూపులు’ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అలాగే సిమ్రాన్ చౌదరి, అనీషా అంబ్రోస్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ‘పెళ్లి చూపులు’ రేంజ్ లో సక్సెస్ కాకపోయిన ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చింది.

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాని రెండో సారి రిలీజ్ చేసినపుడు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడంట. మొదటి సినిమాలో ఉన్న క్యాస్టింగ్ తోనే ఈ సీక్వెల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో మీమ్స్ గా వైరల్ అవుతూ ఉంటాయి. దీనిని బట్టి సినిమా యూత్ కి ఎంత బాగా రీచ్ అయ్యిందో చెప్పొచ్చు. అందుకే తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. తరుణ్ భాస్కర్ చివరిగా ‘కీడాకోలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ చిత్రం పెద్దగా మెప్పించలేదు. దీని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ‘ఈ నగరానికి ఏమైంది 2’ చేయబోతున్నాడు.

ఎస్ ఒరిజినల్స్ ఈ సినిమాని నిర్మించబోతోందంట. ‘35 చిన్న కథ కాదు’ మూవీతో ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రొడక్షన్ నెంబర్ 2గా ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది 2’ సినిమాని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీకి సంబందించిన కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందంట. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయ్యాడు.

నటుడిగా మూవీస్ చేస్తూనే దర్శకుడిగా తన క్రియేటివిటీకి పదును పెట్టి సీక్వెల్ కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ‘ఈ నగరానికి ఏమైంది 2’ లో తరుణ్ భాస్కర్ ఎలాంటి కథ చెబుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిట్ మూవీ సీక్వెల్ కావడంతో కచ్చితంగా ఎంతో కొంత హైప్ ఉంటుంది. అలాగే విశ్వక్ సేన్ ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అతనితో మూవీ అంటే కచ్చితంగా బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది.