ఈషా రెబ్బా గ్లామర్ డోస్.. ఆ డ్రెస్సుకే అందమొచ్చింది
తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో కొంతమంది తెలుగు హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది.
By: Tupaki Desk | 22 Nov 2024 2:45 AM GMTతెలుగు చిత్రపరిశ్రమలో ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో కొంతమంది తెలుగు హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ లు చూడకపోయినప్పటికి వారి నటనతో మాత్రం మంచి క్రేజ్ అందుకున్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బ ఒకరు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నటి ఈషా రెబ్బా. ఇక రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటోలతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఈ ఫోటోలలో ఆమె తెల్లటి అవుట్‌ఫిట్‌లో కనిపిస్తూ, ఒక సొగసైన ప్రొఫెషనల్ లుక్‌ను ప్రదర్శించింది.
నాజూకైన ఫ్యాషన్, గ్లామర్ కాంబినేషన్‌తో ఆమె ఈ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంది. ఈషా గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధమే అనేలా దర్శనమిస్తోంది. ఇక ఈషా రెబ్బా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు మోడలింగ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది, తన సహజమైన అభినయంతో మొదట్లోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
తరువాత 'అ!', 'అమీ తుమీ' వంటి సినిమాల్లో తన ప్రతిభను నిరూపించింది. ఈ చిత్రాలు ఈషాకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈషా 'మామా మశ్చీంద్ర' సినిమాలో కనిపించింది, కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ లుక్లతో నిత్యం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలలో మాత్రం ఈషా న్యూ గ్లామర్ అవతార్ నెటిజన్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. తెల్లటి డ్రెస్‌లో చేసిన ఫోటోషూట్ అందులోని హైలైట్. ఈ లుక్‌లో ఆమె ఒదిగిన లైన్స్, స్టైలిష్ హెయిర్డో, చార్మింగ్ లుక్స్ అన్ని కలిసి ఆమెకు మరింత ఆకర్షణను తెచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఈషా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుతున్నాయి. మరి అమ్మడికి కొత్తగా ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.