Begin typing your search above and press return to search.

జిమ్ లో ఈషా రెబ్బ వయ్యారాల వల

తాజాగా జిమ్ లో కసరత్తులు చేసిన తర్వాత ఫోటోలను షేర్ చేసింది. ముఖంపై చెమట స్పష్టంగా కనపడుతోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 1:23 PM GMT
జిమ్ లో ఈషా రెబ్బ వయ్యారాల వల
X

ఈషా రెబ్బా అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు అందం. అయితే, తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ లైన్ కారణంగానే స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు అన్నీ స్పష్టంగా ఉన్నా, ఆ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయింది. మొదట చిన్న హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టిన ఈషా ఇప్పుడు ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా, వరసగా వెబ్ సిరీస్ లలోనూ మెరుస్తోంది.


ఇటీవల మాయా బజార్ అనే వెబ్ సిరీస్ లో నటించి ఆకట్టుకోగా, ఆ తర్వాత రీసెంట్ గా జెడీ చక్రవర్తితో కలిసి దయా అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. దీనిలో డీ గ్లామర్ లుక్ లో నటించి అందులోనూ నిండు గర్భిణి పాత్ర పోషించి ఆకట్టుకుంది. సినిమాల్లో కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువ అవకాశాలు అందుతున్నాయి. అయితే, తనకు అందిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది.

కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా జిమ్ లో కసరత్తులు చేసిన తర్వాత ఫోటోలను షేర్ చేసింది. ముఖంపై చెమట స్పష్టంగా కనపడుతోంది. సింపుల్ టీషర్ట్, షార్ట్ ధరించి ఉంది. తన థైస్ అందాలను చూపిస్తూ, ఫిట్ గా ఉండేందుకు తాను ఎంత కష్డపడుతోందో చెప్పకనే చెప్పేసింది.

ఇదిలా ఉండగా, ఈషా అంతకు ముందు, ఆ తర్వాత సినిమాలో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ మూవీ తో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వరసగా అవకాశాలు వస్తాయని అనుకుంది కానీ, రాలేదు. అరవింద సమేతలో సెకండ్ హీరోయిన్ గా నటిచింది. కానీ అది కూడా పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో, మళ్లీ ఏ స్టార్ హీరో సినిమాలోనూ అవకాశం దక్కలేదు.

కానీ, తమిళంలో మాత్రం అవకాశాలు క్యూలు కడుతున్నాయి. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ ఆఫీసర్లుగా నటించడం విశేషం.