Begin typing your search above and press return to search.

ఈషా రెబ్బ.. సెల్ఫీలో కిర్రాక్ లుక్

ఆ తర్వాత చిన్న పాత్రలతో కొనసాగుతూ, తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 2:50 PM GMT
ఈషా రెబ్బ.. సెల్ఫీలో కిర్రాక్ లుక్
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఈషా రెబ్బ. ఈ బ్యూటీ ప్రస్తుతం తన కెరీర్ లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. వరంగల్ లో పుట్టి పెరిగిన ఈషా 2012లో "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిన్న పాత్రలతో కొనసాగుతూ, తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, పెద్ద సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


ఈషా చేసిన పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. "అంతకుముందు ఆ తర్వాత" సినిమాతో హీరోయిన్ గా తొలి విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాత చేసిన "బందిపోటు," "దర్శకుడు," "బ్రాండ్ బాబు" వంటి చిత్రాలు ఆమెకు నటిగా మరింత బలమైన స్థానం తీసుకువచ్చాయి. ఎన్టీఆర్ నటించిన "అరవింద సమేత" సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.


ఈషా రెబ్బ కేవలం గ్లామర్ పాత్రలతోనే కాకుండా, కథనంలో బలమైన పాత్రలు చేస్తూ, తనను తాను వివిధ కోణాల్లో డిఫరెంట్ గా చూపించుకోవాలని చూస్తోంది. గ్లామర్ పాత్రలు చేసేటప్పుడు కూడా, కేవలం ఆకర్షణకే పరిమితం కాకుండా, వాటిలో కంటెంట్ ఉండాలని ఆమె ఆలోచన. అందుకే, చిన్న పాత్రలు అయినా కథలో బలమైన అంశం ఉంటే వెంటనే అంగీకరిస్తుంది.


సోషల్ మీడియా ద్వారా కూడా ఈషా రెబ్బకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు తన ఫోటోషూట్ లతో, ప్రత్యేకమైన స్టిల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల అమ్మడు సెల్ఫీ ఫొటోను షేర్ చేసుకోగా అందులో స్మైల్ తోనే ఫిదా చేసింది. గ్లామర్ ఘాటు పెద్దగా లేకపోయినా అమ్మడు తన ఫ్యాషన్ లుక్ తో బ్యూటీఫుల్ హీరోయిన్ అనిపించుకుంటోంది.

ఇక ఈషా చేసిన తాజా సినిమా "మామ మశ్చింద్ర" అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆమెపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె రెండు కొత్త చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలానే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.