Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల తెలుగమ్మాయి చీర కట్టు

టాలీవుడ్‌ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావడమే గగనంగా పరిస్థితి ఉంది

By:  Tupaki Desk   |   30 May 2024 10:18 AM GMT
పిక్ టాక్‌ : అందాల తెలుగమ్మాయి చీర కట్టు
X

టాలీవుడ్‌ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు రావడమే గగనంగా పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఈషా రెబ్బ వంటి కొందరు హీరోయిన్స్‌ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్నారు. స్టార్‌ హీరోలకు జోడీగా ఇప్పటి వరకు నటించకున్నా కూడా వరుసగా మీడియం రేంజ్ సినిమాల్లో చేస్తుంది.

తెలుగు అమ్మాయి అయినా కూడా పేరు మరియు ఆమె అందం ఇంకా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఉత్తరాది ముద్దుగుమ్మ అయ్యి ఉంటుంది అనే ఫీల్‌ ను కలిగిస్తుంది. తెలుగు అమ్మాయిల్లో తానే టాప్‌ అంటూ ఎప్పటికప్పుడు తన అందాల ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ అనిపించుకుంటూ ఉంటుంది.

తాజాగా మరోసారి అందరి చూపును తన వైపుకు తిప్పుకోవడం మాత్రమే కాకుండా, అందరూ కూడా అలా చూస్తూ ఉండి పోయే విధంగా చేసిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బ. చీర కట్టు లో వావ్‌ అనిపించేంత అందం ఈ అమ్మడి సొంతం అంటూ అంతా కూడా కితాబిస్తున్నారు.

సింపుల్‌ అండ్‌ సూపర్‌ చీర కట్టు లో క్లీ వేజ్‌ షో తో అందాలను చూపించి చూపించకుండా ఊరిస్తున్న ఈషా రెబ్బ కవ్వించే ఫోజ్‌ లకు నెటిజన్స్‌ యొక్క గుండె జారి పోతుంది. ఈ స్థాయి అందాల ఆరబోతకు ఎంతటి వారు అయినా కూడా పడిపోవాల్సిందే కదా.

ఈ చీర కట్టు ఈషా ను ఎంత చూసినా తనివి తీరడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి ఫిల్మ్‌ మేకర్స్ ఆ దిశగా ఏమైనా ప్రయత్నిస్తారా అనేది చూడాలి.