Begin typing your search above and press return to search.

ఏంటి.. రానా, దుల్కర్ మధ్య ఈగో క్లాషా?

రానా, దుల్కర్ సల్మాన్ కలిసి మల్టీస్టారర్ మూవీ కాంత చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 3:56 PM GMT
ఏంటి.. రానా, దుల్కర్ మధ్య ఈగో క్లాషా?
X

టాలీవుడ్ హల్క్ రానా, మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మధ్య ఈగో క్లాష్ వచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది!! దీంతో అవునా.. వాళ్లద్దరి మధ్య ఏం జరిగింది? అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా.. ఈగో క్లాష్ అవ్వడమేంటని అనుకుంటున్నారు. అయితే ఇదంతా జరిగింది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో! మీరు విన్నది నిజమే.. అసలు విషయమేమింటంటే?

రానా, దుల్కర్ సల్మాన్ కలిసి మల్టీస్టారర్ మూవీ కాంత చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నీలా ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఇప్పుడు కాంత మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు కాంత మేకర్స్.

కాంత మూవీకి రానా, దుల్కర్ నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినీ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తో మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రానా హీరోగా, దుల్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించనున్నారని సమాచారం. దర్శకుడిగా సముద్రఖని నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీలో భాగంగా.. హీరో, అసిస్టెంట్ డైరెక్టర్ కు క్లాషెస్ వస్తాయట. దాని చుట్టూ సినిమా అంతా నడుస్తుందని వినికిడి.

అయితే దుల్కర్ బర్త్ డే సందర్భంగా.. కాంత ప్రాజెక్ట్ ను మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా మేకర్స్ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ వేడుకకు రానా, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే సహా పలువురు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముగ్గురూ.. వైట్ అండ్ వైట్ ఔట్ ఫిట్స్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తూ సినీ ప్రియులను ఆకట్టుకున్నారు.

వేఫరెర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా కాంత చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాంత కోసం వేఫరర్ ఫిల్మ్స్‌ తో భాగస్వామ్యం కావడం ప్రాజెక్ట్‌ కు కొత్త డైమెన్షన్ ను యాడ్ చేసిందని రానా దగ్గుబాటి తెలిపారు. స్పిరిట్ మీడియాతో కాంతతో జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నానని దుల్కర్ చెప్పారు. భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ అని వెల్లడించారు. మరి కాంత సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.