Begin typing your search above and press return to search.

భార‌త‌దేశంలో మొదటి 1000 ఎపిసోడ్‌ల‌ TV సీరియ‌ల్

`ఏక్ మహల్ హో సప్నో కా` ఇప్పుడు అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేసింది. 1000-ఎపిసోడ్ ల‌ మార్కును దాటిన మొదటి భారతీయ రోజువారీ సీరియ‌ల్ గా గుర్తింపు పొందింది.

By:  Tupaki Desk   |   22 July 2024 7:30 AM GMT
భార‌త‌దేశంలో మొదటి 1000 ఎపిసోడ్‌ల‌ TV సీరియ‌ల్
X

భారతదేశంలో ఎక్కువ కాలం నడిచే టెలివిజన్ సీరియ‌ళ్ల‌ గురించి ఆలోచిస్తే.. మనకు ``తారక్ మెహతా -ఊల్తా చష్మా, సిఐడి, క్యుకీ సాస్ భీ కభీ బహు థీ , కహానీ ఘర్ ఘర్ కియ్`` గుర్తుకొస్తాయి. అయితే 1000-ఎపిసోడ్ ల‌తో బెంచ్‌మార్క్‌ను దాటిన మొదటిది క్యుకి లేదా కహానీ లేదా మరేదైనా ఏక్తా కపూర్ టీవీ సిరీస్ అని అనుకుంటే పొర‌పాటే.

`ఏక్ మహల్ హో సప్నో కా` ఇప్పుడు అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేసింది. 1000-ఎపిసోడ్ ల‌ మార్కును దాటిన మొదటి భారతీయ రోజువారీ సీరియ‌ల్ గా గుర్తింపు పొందింది. దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షా (వక్త్, ది కేరళ స్టోరీ) ఏక్ మహల్ హో సప్నో కా అనే ఫ్యామిలీ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఇది వెయ్యి ఎపిసోడ్‌లను చేరుకున్న మొదటి టెలివిజన్ డ్రామా సిరీస్‌గా నిలిచింది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో భారతీయ టెలివిజన్‌లో ఎక్కువ కాలం నడిచిన టెలివిజన్ సిరీస్‌లలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. సీరియ‌ల్ 25 జనవరి 1999న ప్రారంభమైంది. 2 సంవత్సరాల 10 నెలల పాటు కొనసాగింది. 29 నవంబర్ 2002న ముగిసింది.

ఈ షో హిట్ గుజరాతీ షో `సప్నా నా వవేటర్‌`కి రీమేక్. ఒరిజిన‌ల్ షో ప్రదర్శన DD గుజరాతీలో ప్రసారం అయింది. 1996 నుండి 1997 వరకు నడిచింది. ప్రముఖ సిట్‌కామ్ ఖిచ్డీ ఫేం ప్రఫుల్, హంసా పరేఖ్ అక‌ రాజీవ్ మెహతా, సుప్రియా పాఠక్ ఈ సీరియ‌ల్‌లో ప్రధాన తారాగణం. ఇద్దరు ప్రతిభావంతులైన నటులు స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న మొదటి షో ఇది. వారితో పాటు ఈ షోలో అజిత్ వచాని, దిన పాఠక్, రసిక్ దవే, మనోజ్ జోషి, వందనా పాఠక్ కీలక పాత్రలు పోషించారు.

ఏక్ మహల్ హో సప్నో కా అనేది గుజరాతీ వ్యాపార దిగ్గజం పురుషోత్తం నానావతి (దివంగత అజిత్ వచాని) చుట్టూ తిరిగే క‌థాంశం. అతడు నలుగురు వివాహిత కుమారులతో కూడిన అతని ఉమ్మడి కుటుంబానికి అధిపతి. ఉమ్మడి కుటుంబం ఎదుర్కొనే సమస్యల నేప‌థ్యంలో సాగుతుంది. కుటుంబ సభ్యుల గొడవలు, వారి విడిపోవడం, వారి కలయిక లేదా వారి మ‌ధ్య‌ విభేదాలను సరిదిద్దుకునే మార్గాలు ఇలా ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో ఈ షో రూపొందింది. ఈ బుల్లితెర సీరియ‌ల్ ఆ కాలంలోని ప్రగతిశీల ప్రదర్శనలలో ఒకటిగా కూడా మెప్పించింది.

సుదీర్ఘకాలం నడిచే హిందీ ఫిక్షన్ షోలు ఏవి? అంటే...ప్రస్తుతం ఎక్కువ కాలం నడిచే హిందీ ఫిక్షన్ షోలలో తారక్ మెహతా కా ఊల్తా చష్మా (4136 ఎపిసోడ్‌లు), యే రిష్తా క్యా కెహ్లతా హై (4493 ఎపిసోడ్‌లు), భబీజీ ఘర్ పర్ హై! (2374 ఎపిసోడ్‌లు) షోల‌కు గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కింది.