Begin typing your search above and press return to search.

ఎన్నికల రిజల్ట్.. టాలీవుడ్ బాదేంటంటే!

దీనికి కారణం రాబోయే ప్రభుత్వాలు టాలీవుడ్ సినిమాల విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉంటాయనేది అర్ధం కాక ఆలోచనలో పడ్డారు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 5:32 AM GMT
ఎన్నికల రిజల్ట్.. టాలీవుడ్ బాదేంటంటే!
X

తెలంగాణలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరో ఒక రోజుల్లో ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి. ఎవరో అధికారంలోకి వస్తారనేది డిసైడ్ అయిపోతుంది. ఏపీలో మరో మూడు నెలల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ఎవరికి వారు అన్నట్లుగా సిద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికల తతంగం అంతా ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ ని రాజేస్తోంది.

దీనికి కారణం రాబోయే ప్రభుత్వాలు టాలీవుడ్ సినిమాల విషయంలో ఎలాంటి ఆలోచనతో ఉంటాయనేది అర్ధం కాక ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలకి ఎక్స్ ట్రా షోలు, టికెట్ రెట్ల విషయంలో హైక్ కావాల్సి ఉంటుంది. అలా అయితేనే పెట్టిన పెట్టుబడి అనుకున్న విధంగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం టాలీవుడ్ సినిమాల విషయంలో పాజిటివ్ దృక్పథంలోనే ఉంది. నిర్మాతలు అడిగిన వెంటనే టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు, అదనపు షోలకి అనుమతులు ఇస్తూ వస్తోంది. అయితే అధికారం మారి కాంగ్రెస్ పీఠం ఎక్కితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది టాలీవుడ్ నిర్మాతలకి అర్ధం కావడం లేదు. ఒక వేళ వారు అధికారంలోకి వస్తే వెంటనే అనుమతులు ఇస్తారా లేదా క్లారిటీ లేదు.

అలాగే ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వం టాలీవుడ్ సినిమాల విషయంలో కాస్తా హెచ్చుతగ్గులు చూపిస్తోంది. అవసరాన్ని బట్టి, సినిమాల బడ్జెట్ బట్టి మాత్రమే అదనపు షోలకి అనుమతులు ఇవ్వడం, టికెట్ పెంచుకునే ఛాన్స్ ఇవ్వడం చేస్తోంది.

తరువాత సంక్రాంతి సీజన్ కి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి వస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు అందరూ టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ అడిగే అవకాశం ఉంది. ఈ సినిమాల విషయంలో తెలంగాణ లో కొత్త ప్రభుత్వం ఒక వేళ వస్తే స్పందన ఎలా ఉంటుందనేది అర్ధం కాని ప్రశ్నగా ఉంది. ఈ కారణంగా ఎన్నికలు టాలీవుడ్ లో ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి.