Begin typing your search above and press return to search.

ఎలెవెన్ టీజర్.. నవీన్ చంద్ర థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్

ఇక ఇప్పుడు తన కొత్త బైలింగువల్ మూవీ "ఎలెవెన్" తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రైం మిస్టరీ థ్రిల్లర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది

By:  Tupaki Desk   |   20 Jun 2024 3:55 AM GMT
ఎలెవెన్ టీజర్.. నవీన్ చంద్ర థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్
X

హీరో నవీన్ చంద్ర ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలతో, కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే "ఇన్‌స్పెక్టర్ రిషి" అనే వెబ్ సిరీస్‌తో పాటు సత్యభామ సినిమాలో కనిపించి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త బైలింగువల్ మూవీ "ఎలెవెన్" తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రైం మిస్టరీ థ్రిల్లర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా "ఎలెవెన్" చిత్రంలోని టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. టీజర్ మొదట్లోనే నవీన్ చంద్ర చెప్పే "రంజిత్ లాంటి ప్రతిభ ఉన్న పోలీసు ఆఫీసరే ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోయారో ఇప్పుడు అర్థమవుతుంది.. ఫింగర్‌ ప్రింట్స్‌ లేవు, సీసీటీవీ ఫుటేజ్‌ లేదు.. కనీసం జుట్టు ఆనవాళ్లు కూడా లేవు" అనే డైలాగ్‌ టీజర్‌ యొక్క సీరియస్ టోన్ ని సెట్ చేస్తుంది. ఈ డైలాగ్ తోనే కేసు క్లూ లేని కష్టతరమైన ఇన్వెస్టిగేషన్ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. అసలు ఆధారాలు లేని ఓ కేసును ఛేదించడమే ఈ సినిమా కథ అని టీజర్ చూసిన వారందరికీ అర్థమయ్యేలా ఉంది. టీజర్ మధ్యలో "ఎలుకను తిన్న పాముకు తెలియదు.. దాన్ని తినడానికి గద్ద ఒకటి వస్తుంది" అనే డైలాగ్ నవీన్ చంద్ర చెబుతారు.

ఈ డైలాగ్ నిందితులను ఉద్దేశించినట్టు ఉంటుందని, కేసులో నలుగుతున్న ఆ సీరియస్ దృశ్యాన్ని ఆకట్టుకునేలా చూపిస్తారు. టీజర్ మొత్తం సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ సీక్వెన్సులతో నిండి ఉంది. ఈ టీజర్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తుంది. నవీన్ చంద్ర తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. ఎలాంటి పాత్రలో అయినా అతని సరికొత్తగా కనిపిస్తాడని అర్ధమవుతుంది.

ఈ సినిమాలో రేయా హరి, శశాంక్ అభిరామి, దిలీపన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ దర్శకుడు లోకేష్ అజ్లిస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైం ఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో సాగుతున్న ఈ టీజర్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచింది. నవీన్ చంద్ర తన ప్రతిభతో, ఆసక్తికరమైన కథలతో ఎప్పటికప్పుడు తన అభిమానులను అలరిస్తున్నారు. "ఎలెవెన్" చిత్రం కూడా విభిన్నంగా ఉందనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అతను ఎలాంటి గుర్తింపు అందుకుంటారో చూడాలి.