Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆడియన్స్ మైండ్ బ్లాక్..!

బిగ్ బాస్ లో ప్రతి ఆదివారం ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం కామనే.

By:  Tupaki Desk   |   28 Sep 2024 10:54 AM GMT
బిగ్ బాస్ 8 : ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్.. ఆడియన్స్ మైండ్ బ్లాక్..!
X

బిగ్ బాస్ లో ప్రతి ఆదివారం ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం కామనే. సీజన్ 8 లో ఇప్పటివరకు 3 వారాలు పూర్తి కాగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఆదిత్య ఓం, సోనియా, మణికంఠ, ప్రేరణ, నబీల్, పృధ్వి నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే ఈ నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తే వారు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఈ వారం సోనియా, పృధ్విలకే తక్కువ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం సోనియా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఐతే ఈ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఉంటుందని టాక్. సోనియా ఎలిమినేట్ అవుతుంది కానీ ఆమెను బయటకు పంపించకుండా సీక్రెట్ రూమ్ కు పంపిస్తారని తెలుస్తుంది. దీనిపై ఆదివారం ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేందుకు బిగ్ బాస్ టీం రరకాల టాస్కులను ప్రవేశ పెడుతున్నారు.

సీజన్ 8 ని ఆడియన్స్ బాగానే ఆదరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో సోనియా కేవలం నిఖిల్, పృధ్విలతోనే ఉంటుంది. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి వారిని వదిలి ఉండట్లేదు. వారిద్దరికీ ఆమె దగ్గర అవుతుంది. మిగతా హౌస్ మెట్స్ తో మాత్రం ఏదో మొహమాటానికి మాట్లాడుతున్నట్టు ఉంది. మరో పక్క పృధ్వి తో యాంకర్ విష్ణు ప్రియ కూడా పులిహోర కలుపుతుంది. హౌస్ లో కంటెంట్ ఇచ్చేందుకు వీళ్లంతా ట్రై చేస్తున్నట్టు ఆడియన్స్ కు అర్థమవుతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్ కు వెళ్తాడా లేదా బయటకు వస్తాడా అన్నది చూడాలి. వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆట మీద ఈ శనివారం నాగార్జున ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు ఎలిమినేషన్ మీద ఒక క్లారిటీ కూడా వస్తుందని చెప్పొచ్చు.