Begin typing your search above and press return to search.

దేవ‌దాస్ కోసం పారూ ఎదురుచూపులు!

తాజాగా దేవ‌దాస్ కోసం వేచి చూస్తున్న‌ పార్వ‌తి వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన ఈ బ్యూటీ ఒక పాట కోసం ఈ వేషం వేశాన‌ని తెలిపింది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 3:30 AM GMT
దేవ‌దాస్ కోసం పారూ ఎదురుచూపులు!
X

ప్రియుడి కోసం ప్రియురాలి ఎదురు చూపులు..అది ఒక అంతులేని వ్యామోహం. ఇదిగో ఇక్క‌డ పారూ అలానే వేచి చూస్తోంది. త‌న ప్రేమికుడు దేవ‌దాస్ కోస‌మే ఈ వెయిటింగ్. దేవ‌ద కోసం ఆత్ర‌ప‌డే పార్వ‌తి పాత్ర‌లో న‌టించాల‌న్న త‌న క‌ల నెర‌వేర లేదు కానీ, క‌నీసం ఇలా అయినా త‌న కోరిక తీరినందుకు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది ఎల్లీ అవ్ రామ్.

తాజాగా దేవ‌దాస్ కోసం వేచి చూస్తున్న‌ పార్వ‌తి వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన ఈ బ్యూటీ ఒక పాట కోసం ఈ వేషం వేశాన‌ని తెలిపింది. ''ఈ పాటలో నా దేవదాస్ మూవ్ మెంట్ ఉంది! ఒక్క కల మాత్రమే కాదు.. రెండుసార్లు నిజమైంది! నన్ను ఎప్పుడూ ఇలాగే పీరియడ్ డ్రామా లుక్ లోకి మార్చుకోవాలనుకున్నాను'' అని తెలిపింది.

నేను అరబిక్ మ్యూజిక్ వీడియోలో క‌నిపించాలని కలలు కన్నాను. ఎందుకంటే నేను యుక్తవయసులో ఎప్పుడూ చాలా అరబిక్ పాటలు వినేదానిని. అర‌బిక్ పాట‌లు పాడుతూ నృత్యం చేస్తాను. ఇప్పుడు నేను నా రెండు పెద్ద కలలను గుర్తుపెట్టుకున్నాను అని తెలుసుకుని నవ్వుతూ కూర్చున్నాను.. దేవుడి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కలలు కనే ధైర్యం .. విశ్వాసం కలిగి ఉండండి.. అని రాసింది. అది మీకు కనీసం తెలిసినప్పుడు అది చివరికి జరుగుతుంది. ఇంత అందంగా న‌న్ను డిజైన్ చేసినందుకు మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు! అని తెలిపింది.

బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ కి దేవ‌దాస్ సినిమా అంటే పిచ్చి ఇష్టం. అందులో పారూగా న‌టించాల‌నుంద‌ని చాలా కాలంగా చెబుతోంది. రెండేళ్ల క్రితం దేవదాస్ నుండి పారూ వేషంలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎల్లి కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్' ఛాలెంజ్‌ని హోస్ట్ చేస్తున్న రోజుల‌ నుండి ఇది త్రోబాక్ పిక్. ఎల్లీ అవ్రామ్ దేవదాస్ నుండి పారో వేషంలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది.

సంజయ్ లీలా భ‌న్సాలీ 2002 చిత్రం 'దేవదాస్' 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా, ఎల్లి పారో లాగా దుస్తులు ధరించింది. మ‌ళ్లీ కొన్నాళ్ల త‌ర్వాత పార్వ‌తి రూపంలో మెరిసింది ఎల్లీ. ఇది అమెజాన్ మ్యూజిక్ ఆల్బ‌మ్ అని ఇన్ స్టాలో వెల్ల‌డించింది. ఇటీవ‌ల వ‌రుస‌గా మ్యూజిక్ ఆల్బ‌మ్స్ లో న‌టిస్తోంది ఎల్లీ. సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో తీరిక స‌మ‌యాల్ని ఇలా ప్లాన్ చేస్తోంది.