Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బికినీ బీచ్‌లో ఎల్లీ విర‌హాగ్ని జ్వ‌ల‌నం

ఎల్లీ బీచ్ ప‌రిస‌రాల్లో హొయ‌లు పోయిన తీరు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది.

By:  Tupaki Desk   |   14 Aug 2024 3:57 AM GMT
ఫోటో స్టోరి: బికినీ బీచ్‌లో ఎల్లీ విర‌హాగ్ని జ్వ‌ల‌నం
X

ఎల్లి అవ్రామ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టాషాను పెళ్లాడ‌క ముందు హార్థిక్ పాండ్యాతో డేటింగ్ చేసింద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ భామ అంద‌చందాలు హొయ‌లు యువ‌త‌రంలో ఎప్పుడూ హాట్ టాపిక్. ఎల్లీ నిరంత‌ర ఫోటోషూట్ల‌తో సోషల్ మీడియాల్లో నిప్పులు చెరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాలో కొన్ని వరుస ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ లో ఎల్లి సముద్రతీరంలో చెల‌రేగిపోయి క‌నిపిస్తోంది. వేడెక్కించే బికినీలో పోజులిచ్చింది. బికినీపై ఆచ్ఛాద‌న‌గా క‌ప్పుకున్న‌ తెల్లటి చొక్కా బ‌ట‌న్ లెస్ గా క‌నిపించింది. ఎల్లీ బీచ్ ప‌రిస‌రాల్లో హొయ‌లు పోయిన తీరు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో హాట్ టాపిగ్గా మారింది.


``హాలిడే ఫీలింగ్ రావాలంటే మీకు ఒకటి కావాలి.. ఎందుకంటే మీరు ప్రతిరోజూ వర్క్ కాల్స్‌లో ఉన్నారు. ఎవరూ ఇలా ఆస్వాధించ‌లేదు!`` అంటూ తాజా ఫోటోషూట్ కి టీజింగ్ క్యాప్ష‌న్ ని ఇచ్చింది ఎల్లీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఎల్లీ త‌న అభిమానుల‌కు సేద దీరే ట్రీట్ ఇచ్చిందని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బికినీలో విర‌హంతో వీగిపోతోందంటూ కొంద‌రు వ్యాఖ్యానించారు. ఎల్లీ చంపుతోంది.. నీళ్ల‌ను మ‌రిగిస్తోంది! అంటూ అభిమాని ఒక‌రు దీనిపై వ్యాఖ్యానించారు. మరికొందరు కామెంట్స్ విభాగంలో ఫైర్- హార్ట్ ఎమోజీలను షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వేగంగా యువ‌త‌రంలో షేర్ అవుతున్నాయి.


కిస్ కిస్కో ప్యార్ కరూన్, గణపత్, గుడ్ బై, మలంగ్, కోయి జానే నా.. లాంటి చిత్రాల్లో నటించింది ఎల్లీ అవ్‌రామ్. ఆమె సల్మాన్ ఖాన్ వివాదాస్పద రియాలిటీ షో `బిగ్ బాస్ 13`లో కూడా పాల్గొంది. గత సంవత్సరం, ఎల్లి అవ్రామ్ హౌటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వానికి సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడి, సినీఇండ‌స్ట్రీలో తన అనుభవాలను గురించి ఓపెనైంది. పరిశ్రమలోని ఒక వ్యక్తిని క‌లిసిన‌ప్పుడు.. అత‌డు త‌న కన్యత్వం గురించి నిర్మొహమాటంగా అడిగిన సంఘటన గురించి ఎల్లీ వెల్ల‌డించింది. ఎల్లీ విదేశీ వ‌నిత కాబ‌ట్టి త‌న‌తో ప‌డ‌క సుఖం పంచుకోవ‌డం సుల‌భం! అని అత‌డు భావించాడ‌ని కూడా చెప్పింది. ఈ వ్యాఖ్య‌లతో తాను ఎంతగా అవమానానికి గురైందో తెలిపింది. పరిశ్రమలో తన దశాబ్దపు కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యగా దీనిని అభివర్ణించింది.