కుర్చీలో కాక పుట్టించే భంగిమలో!
అందులో లో దుస్తుల్లో అందాల విందు చేసింది. జీన్స్ ప్యాంట్ పై గ్రీన్ కలర్ వింటరో కోట్ ధరించి ఎద అందాల్ని మాత్రం ఓపెన్ చేసేసింది.
By: Tupaki Desk | 28 Feb 2024 4:10 PM GMTఇండియాలో స్వీడన్ బ్యూటీగా ఫేమస్ అయి ఎల్లి అవ్రామ్ సుపరిచితమే. 'మిక్కి వైరస్' తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మడి జర్నీ అటు పై నత్తనడకనే సాగింది. ఏడాదికో సినిమా చొప్పున..మధ్య మధ్యలో గ్యాప్ లతో కెరీర్ ని నెట్టుకొచ్చింది. ఏ దశలోనూ సొగసరి బిజీగా నటిగా మారింది లేదు. అలాగని ఖాళీగానూ లేదు. వచ్చిన అవకాశాలతో కెరీర్ ని ముందుకు సాగించింది. ఇటీవలే రిలీజ్ అయిన 'గణపత్' సినిమాలోనూ నటించింది.
ఇక టెలివిజన్ షోస్..వెబ్ సిరీస్ ల్లో సైతం తనదైన మార్క్ వేసే ప్రయత్నం చేసింది. కానీ అక్కడా ఫలించలేదు. ప్రస్తుతానికి చేతిలో సినిమాలైతే లేవు. కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అమ్మడు మళ్లీ సౌత్ లోనూ రాణించాలని సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే తెలుగులో ఇంతవ రకూ లాంచ్ అవ్వలేదు. తమిళ్..కన్నడలో ఇప్పటికే అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇక చివరిగా టాలీవుడ్ ఛాన్స్ ఇస్తుందా? అని ఎదురు చూస్తుంది. అందుకు తగ్గట్టు తనని తాను సోషల్ మీడియాలో బాగానే ప్రమోట్ చేసుకుంటుంది.
బ్యూటీ గ్లామర్ డోస్ పరంగా ప్రత్యేకంగా షైన్ అవ్వాల్సిన పనిలేదు. స్వీడన్ నుంచి దిగిన బ్యూటీ కాబట్టి అందాల విందు వడ్డించడం కొత్తేం కాదు. తానేంటో కెరీర్ ఆరంభంలోనే ప్రూవ్ చేసింది. తాజాగా అమ్మడు ఇన్ స్టాలో కాక పుట్టించే స్నాప్ ఒకట వదిలింది. అందులో లో దుస్తుల్లో అందాల విందు చేసింది. జీన్స్ ప్యాంట్ పై గ్రీన్ కలర్ వింటరో కోట్ ధరించి ఎద అందాల్ని మాత్రం ఓపెన్ చేసేసింది.
లో దుస్తుల్లో ఎల్లీ క్లీవేజ్ సెగలకి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. గాజుకళ్ల బ్యూటీ కిల్లర్ లుక్ కి కిక్కు ఎక్కాల్సిందే. కుర్చీపై కాక పుట్టించే భంగిమ చూపు తిప్పగలమా? నేను ఎప్పటికీ మీ పాత బంగారమే అన్న రేంజ్ లో ఓ కొటేషన్ వదిలేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానుల హాట్ కామెంట్ల జోరు తగ్గడం లేదు.