ఫోటో స్టోరి: బీచ్ ఇసుకలో బికినీ గాళ్ ట్రీట్
స్వీడిష్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ సీరియస్ నటిగా కెరీర్‌ను అన్వేషించడానికి బాలీవుడ్‌లో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తయింది.
By: Tupaki Desk | 12 July 2024 4:21 AM GMTస్వీడిష్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ సీరియస్ నటిగా కెరీర్‌ను అన్వేషించడానికి బాలీవుడ్‌లో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇది తనకు రోలర్-కోస్టర్ రైడ్ అని ఇటీవల ఇంటర్వ్యేలో ఎల్లీ వెల్లడించింది. అయితే స్వీడన్‌లో కుటుంబానికి దూరంగా ఉండటం తనకు అతిపెద్ద సవాలుగా ఉందని, దానిని జయించేందుకు తాను ఇంకా కష్టపడుతున్నానని తెలిపింది.
మరోవైపు ఎల్లీ సోషల్ మీడియా ఫోటోషూట్లకు అంతర్జాలంలో గిరాకీ ఉంది. ముఖ్యంగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో నిరంతరం స్పెషల్ ట్రీట్ ఇచ్చే ఎల్లీ ఈసారి కూడా ఆ విషయంలో అభిమానులను నిరాశపరచలేదు. తాజాగా ఎల్లీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. బికినీలో అందాలను కవర్ చేసేందుకు లూజ్ వైట్ షర్ట్ ని ధరించి మరింత వేడి పెంచింది. ఇక ఇసుకలో బికినీ సుందరి ఎల్లీ అందాలు మరింతగా మైమరిపిస్తున్నాయి.
కుటుంబానికి దూరమైనందుకు ఆవేదన:
2013లో మిక్కీ వైరస్ చిత్రంతో ఎల్లీ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కిస్ కిస్కో ప్యార్ కరూన్, జబరియా జోడి, మలంగ్, నానే వరువేన్, గణపత్ వంటి భారీ ప్రాజెక్ట్‌లలో నటించింది. ఇప్పటికే దశాబ్ధం పైగా కెరీర్ రన్ కొనసాగించింది. ఈ ప్రయాణం గురించి ఎల్లీ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో నా ప్రయాణం అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించింది. ఎల్లీ మాట్లాడుతూ..``ఇది హెచ్చు తగ్గుల రోలర్ కోస్టర్. కానీ నన్ను నమ్మి నటించే అవకాశాలను అందించిన దర్శకనిర్మాతల నుండి నాకు లభించిన ఆదరణ వల్ల నేను అన్నింటినీ అందంగా భావిస్తున్నాను``అని అవ్రామ్ వ్యాఖ్యానించారు.
నేను చాలా విభిన్నమైన పాత్రలు చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. నటిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించే అవకాశాల్ని పొందుతున్నాను. నేను ఎప్పుడూ కలలు కనేది ఇదే. వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు, నేను రకరకాల భాషలలో సినిమాలు చేస్తున్నాను. ఈ ప్రయాణం సంతోషాన్నిచ్చింతి అని తెలిపింది. ఇలా చెప్పుకుంటూ పోతే, కుటుంబానికి దూరంగా ఉండటం ఒక్కటే నాకు అతిపెద్ద సవాల్ అని అంది. ``నేను భారతదేశంలో చాలా పెద్ద ఇల్లు కొనాలనుకుంటున్నాను.. నా కుటుంబాన్ని ఇక్కడకు రప్పించాలి.. తద్వారా నేను వారిని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ 11 సంవత్సరాలలో, నా కుటుంబం లేకుండా ఇక్కడ జీవించడమే అతిపెద్ద సవాల్`` అని చెప్పింది. కుటుంబానికి దూరంగా ఉండటాన్ని అసహ్యించుకుంటున్నానని వారితో కలిసి ఉండటాన్ని ఇష్టపడతానని అంది.