Begin typing your search above and press return to search.

నియాన్ గ్రీన్ బికినీలో ఎల్లీ స్ట‌న్నింగ్ లుక్

తాజాగా మ‌రోసారి బీచ్ వెకేష‌న్ నుంచి ఎల్లీ తాజా ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్గా మారాయి.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:32 PM GMT
నియాన్ గ్రీన్ బికినీలో ఎల్లీ స్ట‌న్నింగ్ లుక్
X

స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్ న‌టిగా ఐట‌మ్ గాళ్ గా సుప‌రిచితం. విదేశాలకు చెందిన మోడ‌ల్ కం న‌టి బాలీవుడ్ లో కెరీర్ బండిని న‌డిపించేస్తోంది. సోష‌ల్ మీడియాల్లోను ఎల్లీకి అద్భుత‌మైన ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక ఎల్లీ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోషూట్లు ఇప్ప‌టికే ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా మ‌రోసారి బీచ్ వెకేష‌న్ నుంచి ఎల్లీ తాజా ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్గా మారాయి.


నియాన్ గ్రీన్ బికినీలో అవ్ రామ్ దుమ్ము దులిపేస్తోంది. బీచ్ ఇసుక‌లో ఎల్లీ ఎంత‌గా ఎంజాయ్ చేసిందో ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ వెల్ల‌డిస్తోంది. బాడీ కాన్ బికినీలో ఎల్లీ అవ్ రామ్ టూ హాట్ గా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ వేగంగా వైర‌ల్ అవుతున్నాయి.


ఈ బ్యూటీ కెరీర్ మ్యాట‌ర్ లోకి వెళితే.. బాలీవుడ్ లో అవ్ రామ్లి కెరీర్ స్పీడ్ అంతంత‌మాత్ర‌మే. గ‌డిచిన రెండేళ్ల‌లో కేవ‌లం రెండు హిందీ సినిమాల్లో మాత్ర‌మే న‌టించింది. మ‌ధ్య‌లో ఓ త‌మిళ చిత్రం చేసింది. స‌ల్మాన్ భాయ్ కెరీర్ ఆరంభ‌మే `బాడీగార్డ్` లాంటి హిట్ సినిమాలో అవ‌కాశం క‌ల్పించాడు. అమీర్ తో స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇటీవ‌ల‌ అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో న‌టించింది. పియానో అనే హిందీ- ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంలోనూ ఎల్లీ అవ్ రామ్ న‌టిస్తోంది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టిస్తున్న‌ గ‌ణ‌ప‌త్ పార్ట్ 1 లో న‌టిస్తోంది. నానే వ‌రుణ‌న్ అనే త‌మిళ చిత్రంలోనూ న‌టించింది. ఎల్లీ మ‌రోవైపు డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగాను కొన‌సాగుతోంది.


ఎల్లి స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జన్మించింది. టైరెసో కొమ్మున్, స్టాక్‌హోమ్‌లో పెరిగింది. ఈ బ్యూటీ గ్రీకు తండ్రి, జానిస్ అవ్రామిడిస్, ప్రస్తుతం స్వీడన్‌లో స్థిరపడిన సంగీతకారుడు. ఆమె స్వీడన్ తల్లి మరియా గ్రాన్‌లండ్ ఒక న‌టి. ఇంగ్మార్ బెర్గ్‌మాన్ ఫన్నీ సిరీస్ `అలెగ్జాండర్‌`లో న‌టించింది. అవ్రామ్ తన ప్రారంభ సంవత్సరాల నుండి ఫిగర్ స్కేటింగ్, పాడటం, డ్యాన్స్‌పై ఆసక్తిని కనబరిచింది. అవ్రామ్ స్వీడన్‌లోని స్కేన్ కౌంటీలో థియేటర్ నడుపుతున్న ఆమె తల్లి అత్త నుండి నటనలో శిక్షణ పొందింది. 17 సంవత్సరాల వయస్సులో, అవ్రామ్ స్టాక్‌హోమ్ కి చెందిన `పరదేశి` అనే డ్యాన్స్ గ్రూప్‌లో సభ్యురాలు అయింది. ప్రధానంగా బాలీవుడ్ పాటలపై నృత్య ప్రదర్శనలు ఇవ్వ‌డంలో పాపుల‌రైంది. అవ్రామ్ స్వీడన్‌లో కొన్ని యాక్టింగ్ ప్రాజెక్ట్‌లను చేసింది.