పార్టీలో పాము విషం..రిమాండ్ లో బిగ్ బాస్ విన్నర్!
తాజాగా ఓ రేవ్ పార్టీ లో ఏకంగా పాముల విషయంతోనే దొరికన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది
By: Tupaki Desk | 18 March 2024 6:48 AM GMTరేవ్ పార్టీల్లో..బోట్ పార్టీల్లో డ్రగ్స్ వాడకంతో దొరికిన వారెంతో మంది. పార్టీల పేరుతో మాదక ద్రవ్యాల వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంటుదనడానికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. ఆ కేసుల్లో దొరికిన వారంతా బడా బాబుల బిడ్డలే. సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఓ రేవ్ పార్టీ లో ఏకంగా పాముల విషయంతోనే దొరికన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
`బిగ్ బాస్` ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ని రేవ్ పార్టీలో పాముల్ని వినియోగించాడు అనే ఆరోపణతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికిప్పుడు కోర్టు 14 రోజులు జ్యూడీషల్ రిమాండ్ విధించింది. గత ఏడాది రేవ్ పార్టీలో పాము విషాన్ని వినోద ఔషదంగా వాడినందుకు అతడితో పాటు మరో ఐదుగురిపై నోయిడా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. సెప్టెంబర్ లో పోలీసులు రైడ్ లో భాగంగా నలుగురు పాములు పట్టేవారిని సహా ఐదురుగురిని అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిది పాములు..వాటి విషాన్ని స్వాదీనం చేసుకున్నారు. వీడియో షూట్ కోసం..రేవ్ పార్టీల కోసం పాముల్ని కూడా వినియోగించాడు అనే ఆరోపణ ఉంది. అయితే ఆ ఆరోపణల్ని ఎల్విష్ యాదవ్ ఖండిస్తు న్నాడు. నిర్దోషిగా రుజువైతే కెమెరాల ముందు బట్టలు విప్పి ఓపెన్ డాన్సు చేస్తానని స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. తనని కావాలనే ఈ కేసులో ఇరికించడానికి అన్నాడు.
అయితే పోలీసుల విచారణలో ఎల్విష్ నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు పోలీస్ వర్గాలు చెబుతు న్నాయి. పాము విషం మత్తు ఔషదంగా అలవాటు పడితే ఆ మత్తు నుంచి బయట పడటం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ పాము విషం అన్నది నోయిడాకే పరిమితమైందా? హైదరా బాద్..బెంగుళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా ఆచరణలో ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.