బడా బ్యానర్లకే రాజుగారు ఒణుకు పుట్టిస్తున్నారా?
రిలీజ్ హక్కులు దిల్ రాజు దక్కించుకోవడంతో బజ్ పీక్స్ కి చేరింది. దీంతో భారీ ఎత్తున థియేటర్లలలో రిలీజ్ ఖాయమైంది.
By: Tupaki Desk | 24 March 2025 11:47 AM ISTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా 'లూసీఫర' కి సీక్వెల్ గా 'ఎల్ -2 ఎంపురాన్' చిత్రాన్ని పృధ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదే టైటిల్ తో చిత్రం తెలుగుతో పాటు పాన్ ఇండియాలో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. మొన్నటివరకూ ఈ సినిమాపై తెలుగులో పెద్దగా బజ్ లేదు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. 'లూసీఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 'గాడ్ ఫాదర్' టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అలా 'ఎంపురాన్' అంటే తెలుగు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సీన్ మొ త్తం మారిపోయింది. మోహన్ లాల్..పృధ్వీరాజ్ ఒక్కసారిగా తెలుగులోనూ బజ్ తీసుకొచ్చారు. రిలీజ్ హక్కులు దిల్ రాజు దక్కించుకోవడంతో బజ్ పీక్స్ కి చేరింది. దీంతో భారీ ఎత్తున థియేటర్లలలో రిలీజ్ ఖాయమైంది.
ఇప్పటికే ఏడు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు తెగినట్లు వినిపిస్తుంది. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ అవుతుంది. అయితే ఆ మరుసటి రోజే మార్చి 28న రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నితిన్ నటించిన 'రాబిన్ హుడ్', 'మ్యాడ్' టీమ్ నటించి 'మ్యాడ్ స్క్వేర్' ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. 'రాబిన్ హుడ్' నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కాగా, మ్యాడ్ స్క్వేర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది.
ఈ రెండు సినిమాలపై కూడా మంచి అంచనాలున్నాయ. రెండు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లే. అయితే ఎంపురాన్ పై క్రియేట్ అవుతోన్న బజ్ తో ఆ రెండు చిత్ర నిర్మాణ సంస్థల మధ్య గుబులు మొదలైందనే వార్తలొస్తున్నాయి. మలయాళ సినిమా కావడంతో ఇంత కాలం...ఒకే రోజు రిలీజ్ అనుకున్నా? పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమాకి అనూహ్యంగా హైప్ రావడంతో? బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారుతుందనే చర్చ సాగుతుంది. ఓ పరభాష చిత్రం రిలీజ్ చూసి రెండు తెలుగు సినిమాలు ఆందోళనకు గురవ్వడం ఇదే తొలిసారి.