Begin typing your search above and press return to search.

L2E -ఎంపురాన్: నిప్పుతో పెట్టుకుంటే మ‌సైపోతారు!

మలయాళీలు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం L2E ఎంపురాన్. మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్ర‌మిది

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:37 PM GMT
L2E -ఎంపురాన్: నిప్పుతో పెట్టుకుంటే మ‌సైపోతారు!
X

మలయాళీలు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం L2E ఎంపురాన్. మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. బ్లాక్ బ‌స్ట‌ర్ లూసీఫ‌ర్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పృథ్వీరాజ్ ఇప్పుడు ద్వితీయ ప్ర‌య‌త్నంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 'లూసిఫర్'కి సీక్వెల్ క‌థ‌తో ఇది తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 5న ప్రారంభమైంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయ‌గా అది హాట్ టాపిక్ అయింది. ఎంపురాన్ ఈజ్ బ్యాక్, ది సాగా సరికొత్త పవర్ ప్లేతో కొనసాగుతుందని మేక‌ర్స్ చెబుతున్నారు.


పోస్ట‌ర్ సీరియ‌స్ టోన్ తో ఉత్కంఠ‌ను పెంచింది. ఇందులో భ‌గ‌భ‌గ నిప్పుల్లో కాలుతున్న రెండు భారీ కంటైన‌ర్ ల మ‌ధ్య మోహ‌న్ లాల్ వెప‌న్ ప‌ట్టుకుని సీరియ‌స్ గా గాల్లో ఎగురుతున్న హెలీకాఫ్ట‌ర్ వైపు చూస్తున్నారు. కంటైన‌ర్లు నిప్పుల్లో మ‌సైపోతున్నాయి. ఈ స‌న్నివేశం చూస్తుంటే ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు భీక‌రంగా ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతోంది. స‌మ‌కాలీన ప్ర‌పంచంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఎంపూర‌న్ అల‌రించ‌నుంద‌న్న క్యూరియాసిటీని ఈ పోస్ట‌ర్ పెంచింది.

ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మాతృక (పార్ట్ 1)లో న‌టించిన స్టార్లు మెజారిటీ భాగం న‌టిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, జాన్ విజయ్, సచిన్ ఖేడేకర్, బైజు సంతోష్, కళాభవన్ షాజోన్, ఫాజిల్, సురేష్ చంద్ర మీనన్, నైలా ఉష త‌దిత‌ర‌ తారాగణం న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దీపక్ దేవ్ అందించగా, సినిమాటోగ్రఫీని సుజిత్ వాసుదేవ్ నిర్వహించారు.

ఇదిలా ఉంటే మోహన్ లాల్ న‌టిస్తున్న‌ అప్ కమింగ్ మూవీ 'బరోజ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం 28 మార్చి 2024న థియేటర్లలోకి రానుంది. మై డియర్ కుట్టిచాతన్‌-చోటా చేతన్ అనే ఐకానిక్ మూవీ క‌థార‌చ‌యిత జిజో పున్నూస్ రచించిన ఈ ఫాంటసీ చిత్రం అతడి 'బరోజ్: గార్డియన్ డిగామా నిధి' అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో గురు సోమసుందరం, సీజర్ లోరెంటే రాటన్, ఇగ్నాసియో మాటియోస్, కల్లిరోయ్ టిజియాఫెటా కూడా ఉన్నారు. ఈ సినిమాతో నటుడు మోహన్‌లాల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని 16 భాషల్లోకి డబ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఇది ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అల‌రించ‌నుంది.