OG విలన్‌కి G2 సెట్లో మెడకు గాయం
ఇది అడివి శేష్ నటిస్తున్న గూఢచారి 2 (జి 2). ఈ సినిమా సెట్లో ప్రమాదవశాత్తూ అతడికి గాయం అయిందని తెలిసింది.
By: Tupaki Desk | 7 Oct 2024 4:13 PM GMTపవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటిస్తున్నాడు ఇమ్రాన్ హష్మి. ఈ సినిమాలో పవన్ తో నువ్వా నేనా? అంటూ తలపడే ప్రతినాయక పాత్రలో అతడి ఆహార్యం యూనిక్ గా ఉంటుందని చెబుతున్నారు. ఓజీకి సాహో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇమ్రాన్ హష్మి మరో క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ఇది అడివి శేష్ నటిస్తున్న గూఢచారి 2 (జి 2). ఈ సినిమా సెట్లో ప్రమాదవశాత్తూ అతడికి గాయం అయిందని తెలిసింది.
ఒక భారీ యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తుండగా, ఓ చోటి నుంచి ఇంకో చోటికి ఇమ్రాన్ హష్మి జంప్ చేయాల్సి ఉంది. అతడు వేగంగా జంప్ చేయగా, అదుపుతప్పి కింద పడ్డారు. మెడకు గాయం అయిందని తెలిసింది. మెడపై స్వల్పంగా కట్ అయినట్టు కనిపిస్తోంది. గాయం నుంచి రక్తం కారుతోంది. దానికి వెంటనే ప్రాథమిక చికిత్స చేసి కట్టు వేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.
యాక్షన్ సన్నివేశాల్లో డేరింగ్ ఫీట్స్ వేయడంలో బాలీవుడ్ స్టార్లకు ధీటుగా టాలీవుడ్ స్టార్లు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది యువహీరోలు ఇటీవల డూప్స్ లేకుండా యాక్షన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం టాలీవుడ్ నుంచి అరడజను పైగా హీరోలు సెట్లో గాయాలపాలవ్వడం చర్యనీయాంశమైంది. కొందరికి పెను ప్రమాదాలే ఎదురయ్యాయి. కానీ అన్నిటి నుంచి కోలుకుని బయటపడ్డారు. ఇటీవల సెట్లో గాయం అవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే.