Begin typing your search above and press return to search.

భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య థియేట‌ర్లో ర‌హ‌స్య ఒప్పందం!

బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

By:  Tupaki Desk   |   26 July 2024 11:30 PM GMT
భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య థియేట‌ర్లో ర‌హ‌స్య ఒప్పందం!
X

బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సీరియ‌ల్ కిస్స‌ర్ గా బ్రాండ్ ఇమేజ్ సంపాదించిన ఇమ్రాన్ ఓ సంచ‌ల‌నం. కొన్నాళ్ల పాటు సీరియ‌ల్ కిస్స‌ర్ ఓ వెలుగు వెలిగిన న‌టుడు. అయితే అత‌డి సెకెండ్ ఇన్నింగ్స్ మాత్రం అంద‌కు భిన్నంగా సాగుతుంది. తానే ఆ ర‌క‌మైన ఇమేజ్ అవ‌స‌రం లేద‌నుకుని రొమాంటిక్ స‌న్నివేశాల‌కు..పెద‌వి ముద్దుల‌కు దూర‌మ‌య్యాడు.


ప్ర‌స్తుతం అత‌డి జ‌ర్నీచాలా సెల‌క్టివ్ గా ఉంది. అయితే కాపీ విత్ క‌ర‌ణ్ టాక్ షోలో సీరియ‌ల్ కిస్స‌ర్ గా ఉన్న స‌మ‌యంలో భార్య నుంచి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కున్నాడో? రివీల్ చేసాడు. హీరోయిన్ల‌తో లిప్ కిస్సులు..రొమాంటిక్ స‌న్నివేశాలు చేసిన ప్ర‌తీసారి తన భార్యకు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ బాహుమతిగా ఇచ్చేవారుట‌. అలాగే ఆమె కోపాన్ని తగ్గించడానికి షాపింక్ కి తీసుకెళ్లేవారుట‌.

కానీ ఇప్పుడు అలాంటి గిప్టులు ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, షాపింగ్ లకు తిప్పాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదన్నాడు. మ‌ల్లికాషెరావ‌త్ తో క‌లిసి న‌టించిన `మ‌ర్డ‌ర్` సినిమా త‌న భార్య‌తో క‌లిసి చూస్తోన్న స‌మ‌యంలో తెరపై రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ చూసి భార్య కోప‌గించుకుని గోళ్ల‌తో ర‌క్తం వ‌చ్చేలా గీకేద‌ట‌. గాయమైందని, నొప్పి కలుగుతుందని ప్రాదేయపడినా భార్య కోపంతో వ‌దిలేది కాదుట‌.

అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య హ్యాండ్ బ్యాగ్..షాపింగ్ ఒప్పందం కుదిరింద‌న్నాడు. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదని.. ఎందుకంటే ఇప్పుడు తాను లిప్ లాక్ సీన్స్ చేయడం లేదన్నాడు. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం నిల్ అయింద్నాడు. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఓజీ` లో విల‌న్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.