కిస్సర్ అంటే కోపం ఏమీ లేదు
బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరోసారి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 12 July 2024 2:30 PMబాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరోసారి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. తెలుగు లో పవన్ కళ్యాణ్ తో కలిసి ఓజీ లో నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఓజీ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడింది.
త్వరలో ఓజీ షూటింగ్ పునః ప్రారంభం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీ పై కీలక సన్నివేశాలు షూట్ చేసిన దర్శకుడు సుజీత్ మరో షెడ్యూల్ ను త్వరలోనే చేయనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇమ్రాన్ హష్మీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇమ్రాన్ హష్మీ కి గతంలో సీరియల్ కిస్సర్ అనే బిరుదును అభిమానులు ఇవ్వడం జరిగింది. ప్రేక్షకులు కొందరు ఆ బిరుదుతో విమర్శలు చేస్తే మరి కొందరు ప్రశంసలు కురిపించే వారు. ఆ బిరుదు పై తాజాగా ఇమ్రాన్ హష్మీ తన సీరియల్ కిస్సర్ బిరుదు పై స్పందించాడు.
నన్ను ప్రేక్షకులు సీరియల్ కిస్సర్ అన్నందుకు నేను ఎప్పుడు వారిని తప్పుబట్టను. నా చిత్రాల నిర్మాతలు ఆ విషయాన్ని మార్కెటింగ్ చేసుకున్నారు. నాకు కూడా దాని వల్ల ఆర్థికంగా కలిసి వచ్చింది. కనుక దాంట్లో ఒకరిని నిందించడానికి ఏమీ లేదని ఇమ్రాన్ హష్మీ అన్నాడు.