Begin typing your search above and press return to search.

OGపై అతని కామెంట్స్.. ఫ్యాన్స్ ఖుషి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఓజీ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:55 AM GMT
OGపై అతని కామెంట్స్.. ఫ్యాన్స్ ఖుషి..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఓజీ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన చెన్నై భామ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన మేకర్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

గ్యాంగ్ స్టర్ నేపథ్య కథతో వస్తున్న ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులకు అతను పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ 15 ఏళ్ల క్రితం అతను చేసిన సినిమాలు యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కించాయి. బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మి ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.

ఈమధ్యనే వచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3లో కూడా నటించిన ఇమ్రాన్ హష్మి తెలుగులో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నారు. ఈ సినిమా గురించి ఇమ్రాన్ హష్మి చేసిన కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. పవన్ ఓజీ సినిమాను సుజిత్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఓజీ కోసం సుజిత్ క్రియేట్ చేసిన వరల్డ్ సూపర్ గా ఉందని అన్నారు ఇమ్రాన్ హష్మి. సో ఓజీ అనుకున్న రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ కేవలం రీమేక్ లు చేస్తూ వస్తున్నారు. పవన్ ఒరిజినల్ స్టోరీస్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. పవన్ అభిమాని అయిన సుజిత అభిమాన నటుడిని వేరే లెవెల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. టీజర్ తో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసిన సుజీత్ సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంటాడని అంటున్నారు. OGతో పాటుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ కాబట్టి సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి 2024 ఏపీ ఎన్నికల తర్వాతే మిగతా షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సుజిత్ ఓజీ సినిమానే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.