పర్యావరణంపై బాధ్యతగా సినిమాలు తీసేదెవరు?
దీనికి అందాల కథానాయిక, నిర్మాత & వ్యాపారవేత్త అయిన ఆలియా భట్ కి చెందిన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 24 Nov 2023 3:30 PM GMTసినిమా అనేది పూర్తిగా కమర్షియల్ అంశం. అది పెట్టుబడి దారుల వ్యక్తిగత అభిలాషకు సంబంధించినది. డబ్బు సంపాదించడమే ధ్యేయం. కానీ అందుకు భిన్నంగా పర్యావరణంపై బాధ్యతగా సినిమాలు తీసేదెవరు? పర్యావరణంపై సినిమా పండగ కూడా ఉంటుందా? అంటే .. ఎందుకు ఉండదు.. ఇలాంటి ఒక గొప్ప విషయంపై చర్చకు తెర లేపుతోంది ఈ ఫెస్టివల్.
ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్.. అనేది పర్యావరణంపై ప్రతియేటా నిర్వహించే సినిమా పండగ. నాలుగేళ్లుగా ఈ పండగను జరుపుకుంటున్నారు. భారతదేశపు అతిపెద్ద పర్యావరణ చలన చిత్రోత్సవంగా దీనిని చెబుతున్నారు. దీనికి అందాల కథానాయిక, నిర్మాత & వ్యాపారవేత్త అయిన ఆలియా భట్ కి చెందిన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేక సినిమా పండుగ జడ్జిగా అలియా భట్ కొనసాగనుంది. డిసెంబర్ 1 నుండి 10 డిసెంబర్ 2023 వరకు జరగనుంది. ఇప్పుడు నాల్గవ సంవత్సరంలోకి ఈ ఉత్సవం ప్రవేశించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి సినిమా అనే బలయమైన ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి అంకితమైన ఫెస్టివల్ ఇది.
ఈ పండగకు మోటో ఏమిటి? అంటే అది అర్థవంతమైనదని అంగీకరించాలి. సాంఘిక, పర్యావరణ కారణాలపై ప్రత్యేకించి నిర్వహించే వేడుకలివి. వాతావరణ మార్పు, స్థిరత్వం, పర్యావరణం గురించి అవగాహన, ప్రజల్లో చర్చల్ని పెంపొందించడానికి ALT EFF మిషన్ పని చేయనుంది. ఈ కేటగిరీకి చెందిన సినిమాలను ప్రోత్సహించడమే ధ్యేయంగా రూపొందే సినిమాలను ఒక గొడుగు కింద ప్రదర్శించే ఐక్య వేదికగా ఈ సినిమా పండుగను చూడాలి.
ఆలియా భట్- షాహీన్ భట్ తమ ప్రొడక్షన్ హౌస్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ను గతంలో స్థాపించారు. ఇది వైవిధ్యమైన కంటెంట్ తో భారీ ఎత్తున జనాభాతో కనెక్ట్ అయ్యి ఉంది. ALT EFF ఈ దృక్పథాన్ని అందరికీ షేర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఇందులో నిమగ్నం చేయడానికి .. కీలకమైన అంశాలపై తక్షణ చర్చలకు చలనచిత్ర మాధ్యమాన్ని ఉపయోగిస్తుంది. ఈ సంవత్సరం, ALT EFF 50 దేశాల నుండి ఎంపిక చేసుకున్న పర్యావరణ కాన్సెప్ట్ చిత్రాలతో భారతదేశం అంతటా 20 నగరాల్లో ప్రీమియర్లను ప్లాన్ చేసింది. విభిన్న కేటగిరీల ప్రేక్షకులను చేరుకోవడం, పర్యావరణంపై సంభాషణలను ప్రోత్సహించడం.. సామూహిక దృష్టిని ఆకర్షిస్తూ పర్యావరణ సవాళ్లపై అవగాహనను పెంచడం వగైరా ఈ పండుగ లక్ష్యం.
ఈ ఫెస్టివల్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆలియా ఇలా పేర్కొంది, ``ఆల్ లివింగ్ థింగ్స్ ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023తో అనుబంధం కలిగి ఉండటం చాలా గౌరవం. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు. ఇది ఒక ముఖ్యమైన అంశంపై చర్చను ప్రేరేపించడానికి ఒక శక్తివంతమైన సాధనం. పండుగ అనేది గొప్ప సమ్మేళనం. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌లో, ఆలోచనలను రేకెత్తించే లేదా సాధ్యమైన రీతిలో ప్రజా జీవనాన్ని మార్చే కథలను చెప్పడం మా లక్ష్యం. పర్యావరణ స్పృహతో, అర్థవంతమైన మార్పును కలిగిస్తూ శక్తివంతమైన కథలను చెప్పాలనుకునే పండుగకు సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. యువతరం నిర్మాణ సంస్థగా ఇది ఒక సాధనమైన అభ్యాసంగా భావిస్తున్నాం. ఇది మాకు ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ -ALT EFF మధ్య సినర్జీ ఒక డైనమిక్ సహకారంగా భావించాలి. ఇది సినిమాపండుగ తాలూకా సందేశాన్ని రీచబిలిటీని అమాంతం పెంచుతుంది.