Begin typing your search above and press return to search.

ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ @49 ఏళ్లు

ఆగస్టు 15, 1975 లో విడుదల అయిన షోలే సినిమా అప్పటి పరిస్థితుల్లో యావరేజ్ హిట్‌ గా నిలిచినా కూడా ఆ తదుపరి కాలంలో షోలే సినిమా అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న సినిమాగా నిలిచింది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 6:42 AM GMT
ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ @49 ఏళ్లు
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొన్ని సినిమాలకు అత్యంత ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత ఉంటుంది. ఆ కొన్ని సినిమాల్లో 'షోలే' ఒక సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల గురించి ఏ మాత్రం తెలిసిన వారికి అయినా షోలే సినిమా గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. హిందీ సినిమా మేకర్స్ కి మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమా మేకర్స్ కి కూడా షోలే సినిమా అనేది ఒక పాఠం. ఆ సినిమా చూసి ఎంతో మంది దర్శకులు పాఠాలు నేర్చుకున్నారు, నటీనటులు నటన నేర్చుకున్నారు. సినిమాలో ఎంట్రీ ఇవ్వాలని అనుకునే వారికి షోలే సినిమా పాఠశాల వంటిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఆగస్టు 15, 1975 లో విడుదల అయిన షోలే సినిమా అప్పటి పరిస్థితుల్లో యావరేజ్ హిట్‌ గా నిలిచినా కూడా ఆ తదుపరి కాలంలో షోలే సినిమా అత్యంత ప్రజాదరణ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. సలీం - జావేద్ లు కథ అందించగా, రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన షోలే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ మరియు ధర్మేంద్ర లు హీరోలుగా నటించారు. హేమ మాలిని మరియు జయా బచ్చన్ లు హీరోయిన్స్ గా నటించారు. పల్లెటూరి నేపథ్యంతో పాటు, అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా మంచి యూత్‌ ఫుల్‌ స్టోరీగా షోలే రూపొందింది. షోలే సినిమాకు సంగీతం, సినిమాటోగ్రఫీ, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం అన్ని కూడా నూటికి నూరుపాల్లు సెట్‌ అయ్యాయి.

ఒక సినిమాకు అన్ని విభాగాలు కూడా నూరు శాతం సెట్‌ అవ్వడం, అద్భుతంగా వర్కౌట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది షోలే సినిమాకు సెట్‌ అవ్వడం జరిగింది. అందుకే విడుదల అయ్యి 49 ఏళ్లు అవుతున్నా కూడా షోలే సినిమా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. షోలే సినిమాలోని మెహబూబా మెహబూబా, యే దోస్తీ పాటలతో పాటు ఇతర పాటలు ఇంకా కూడా ప్రేక్షకుల ప్లే లిస్ట్‌ లో ఉంటాయి. ఆ పాటలను రిఫరెన్స్ గా తీసుకుని కొన్ని వందల పాటలు వచ్చి ఉంటాయి. ఇక షోలే సినిమా ఇన్సిపిరేషన్ తో ఎన్నో కథలు రాసుకున్న వారు ఉన్నారు.

హీరోల మధ్య స్నేహంను అద్భుతంగా చూపించడంతో పాటు విలన్ గా గబ్బర్ సింగ్‌ పాత్రను చాలా విభిన్నంగా చూపించడం జరిగింది. అప్పటి వరకు ఇండియన్ సినీ ప్రేక్షకులు చూసిన విలన్స్ కి గబ్బర్ సింగ్‌ చాలా డిఫరెంట్‌ గా అనిపించాడు. విలన్స్ ఇలా కూడా ఉంటారా అనుకున్న వారు చాలా మందే ఉన్నారు. షోలే తర్వాత గబ్బర్‌సింగ్‌ తరహాలో ఎంతో మంది విలన్‌ పాత్రలను డిజైన్ చేసి తమ సినిమాల్లో చూపించడం జరిగింది. వచ్చే ఏడాదికి షోలే సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. షోలే ఎప్పుడు రీ రిలీజ్ అయినా రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు సాధించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మూడు కోట్ల భారీ బడ్జెట్టు తో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందట. కర్ణాటక రామనగరలోని రాతి ప్రాంతంలో రెండున్నరేళ్ల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. 198 నిమిషాల నిడివి తో ఈ సినిమా విడుదల అయ్యింది. ముంబైలోని మినర్వా థియేటర్ లో ఐదు సంవత్సరాలకు పైగా నడిచింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యొక్క 2002 పోల్ లో "టాప్ 10 ఇండియన్ ఫిల్మ్స్" పోల్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది. 2005లో 50 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కు న్యాయనిర్ణేతలు ఈ చిత్రాన్ని 50 ఏళ్ల ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు, గుర్తింపులు సినిమాకు అందాయి.