స్టైల్ కా బాప్ అనిపించిన డియోల్ బ్యూటీ!
అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు అప్పుడప్పుడు టచ్ లోకి వస్తుంది.
By: Tupaki Desk | 10 Nov 2024 7:30 PM GMTబాలీవుడ్ బ్యూటీ ఈషా డియోల్ గురించి పరిచయం అవసరం లేదు. ధర్మేంద్ర-హేమా మాలిని డాటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మామ్ రేంజ్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఎంతో బ్యాకప్ ఉన్నా? నటిగా మాత్రం సూపర్ స్టార్ లీగ్ లో ఇంతకీ చేరలేదు. నటిగా చాలా సినిమాలు చేసింది. కాల క్రమంలో ఆ ఛాన్సులు తగ్గాయి. దీంతో అతిధి పాత్రలకు సైతం సై అని ముందుకొచ్చింది. కొన్నాళ్ల పాటు ఆ పాత్రలతోనూ బిజీగా గడిపింది.
టీవీషోలు చేసింది. అయితే గత మూడేళ్ల కాలంలో ఈషా పేరు బాలీవుడ్ లో పెద్దగా వినిపించలేదు. ఆమె ఫేస్ ఇండస్ట్రీలోనూ కనిపించలేదు. సినిమాలు చేస్తే టచ్ లో ఉండేది. అవకాశాలు లేకపోవడంతో? ముఖం సైతం చాటేసింది. ఐదేళ్ల క్రితం `కేక్ వాక్` లో నటించింది. ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో `ఏక్ దువా`లో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఛాన్స్ రావడానికి మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం `మెయిన్` అనే చిత్రంలో నటిస్తోంది.
కానీ అది డిలే ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. ఇలా ఉంది ఇషా కెరీర్. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు అప్పుడప్పుడు టచ్ లోకి వస్తుంది. అలా మెరిసి ఇలా వెళ్లిపోతుంటుంది. తాజాగా అమ్మడు మరో కొత్త పిక్ తో నెట్టింట్లోకి వచ్చేసింది. ప్యాంట్ షర్ట్ ధరించి స్టైల్ కా బాప్ అనిపించే భంగిమతో అదరగొట్టింది. వైట్ అండ్ బ్లాక్ షర్ట్ కాంబినేషన్ పై మ్యాచింగ్ క్యాజువల్ ప్యాంట్ ధరించింది. ముఖాన్ని మ్యాకప్ తో అలంకరించింది.
గోల్డ్ హెయిర్ స్టైల్ బ్యూటీ స్కిన్ టోన్ ని మ్యాచ్ చేస్తుంది. అన్నింటిని మించి అమ్మడు ఎంపిక చేసుకున్న భంగిమ హైలైట్. చైర్ లో స్టైల్ గా పడుకుని ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డియోల్ బ్యూటీ అందానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు.