Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: భంగిమ‌ల‌తో మ‌తి చెడ‌గొడుతున్న బోల్డ్ బ్యూటీ

నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇషా గుప్తా స్ట‌న్న‌ర్ గా నిలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 1:45 AM GMT
ఫోటో స్టోరి: భంగిమ‌ల‌తో మ‌తి చెడ‌గొడుతున్న బోల్డ్ బ్యూటీ
X

ఈషా గుప్తా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ మోస్ట్ సూప‌ర్ మోడ‌ల్ గా, అందాల పోటీల జ‌డ్జిగా ఇషాజీ యువ‌త‌రంలో చాలా మంది భ‌విష్య‌త్ ని నిర్ధేశించారు. టాప్ మోడ‌ల్స్ కెరీర్ ని చ‌క్క‌దిద్దిన అనుభ‌వం ఉంది. క‌థానాయిక‌గాను ఇషా గుప్తా కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిన‌దే. ఇషాను సోష‌ల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉండేవారికి అస‌లే ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇషా గుప్తా స్ట‌న్న‌ర్ గా నిలుస్తుంది. ముఖ్యంగా ఇషా గుప్తా బోల్డ్ ఫోటోషూట్లు దుమారం రేపుతాయి. ఇటీవ‌లి బికినీ షూట్ నుంచి ఇషా గుప్తా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇషా రెడ్ బికినీలో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో దుమారం రేపింది.


ఇటీవ‌ల ఇషా గుప్తా త‌న బిజీ షెడ్యూళ్ల నుంచి కొంత స‌మ‌యాన్ని కుటుంబం కోసం కేటాయించారు. సోదరి నేహాతో ఈషా గుప్తా కుటుంబం ఢిల్లీలో ఉండగా, ఈషా గుప్తా పని కోసం అన్ని మెట్రో న‌గ‌రాల‌ను చుట్టేస్తుంది. ప్రస్తుతం అబుదాబిలో ఎక్కువ సమయం గ‌డుపుతున్న ఇషా ముంబైకి పని కోసం స‌మ‌యం కేటాయిస్తోంది.

ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబ సమయాన్ని గడపడానికి తిరిగి తన స్వగ్రామానికి వస్తుంది ఇషా. ఇటీవ‌ల త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇషా ఒక మంచి నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది అంతా త‌న కుటుంబంతో మంచి సమయాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకుంది. భౌతిక విషయాలతో పాటు ఈ సంవత్సరం నేను నిజంగా ఆశిస్తున్నది ఏమిటంటే, నా తల్లిదండ్రులు, నా సోదరి (నేహా) , నా పిల్లలు (పెంపుడు జంతువులు) సహా నా కుటుంబంతో కలిసి మరిన్ని వెకేష‌న్స్ ని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలను నాతో దాచుకోవాల‌నుకుంటున్నాను.. అని తెలిపింది. ఒక అందమైన కుటుంబం .. కుటుంబంలా మారిన స్నేహితులను ఇచ్చినందుకు ఆశీర్వదించినందుకు నేను దేవునికి కృతజ్ఞురాలిని అని కూడా ఇషా గుప్తా అన్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హౌస్ ఫుల్ 5లో ఇషా గుప్తా న‌టిస్తోంది.