Begin typing your search above and press return to search.

విడాకుల‌తో హీరోయిన్ ఆస్తి విలువ త‌గ్గిపోతోందా?

డ్రీమ్ గర్ల్ హేమ‌మాలిని కుమార్తె ఇషా డియోల్ త‌న‌ భర్త భరత్ తఖ్తానీ నుంచి అధికారికంగా విడిపోయారు

By:  Tupaki Desk   |   10 Feb 2024 2:45 AM GMT
విడాకుల‌తో హీరోయిన్ ఆస్తి విలువ త‌గ్గిపోతోందా?
X

డ్రీమ్ గర్ల్ హేమ‌మాలిని కుమార్తె ఇషా డియోల్ త‌న‌ భర్త భరత్ తఖ్తానీ నుంచి అధికారికంగా విడిపోయారు. బ్రేక‌ప్ ని ఈ జంట‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మాజీ దంప‌తుల‌కు కుమార్తెలు రాధ్య - మిరయాలకు స‌హ త‌ల్లిదండ్రులుగా కొన‌సాగాలని నిర్ణయించుకున్నారు. భరత్ -ఈషా 2012లో ఇస్కాన్ ఆలయంలో సాంప్ర‌దాయ‌ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు విడాకుల సంద‌ర్భంగా వారి ఆస్తుల గురించి ఆరాలు పెరిగాయి. పెళ్లికి ముందు ఈ జంట నికర ఆస్తుల‌ విలువ దాదాపు 180+ కోట్లు.


భరత్ తఖ్తానీ ముంబైకి చెందిన నగల వ్యాపారి. అతడు RG బ్యాంగిల్స్ అనే బ్యాంగిల్ కంపెనీ అధినేత‌. అతడి కుటుంబ సంస్థ అయిన జార్ జ్యువెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఫేమ‌స్. ఈషా - భరత్‌ల ఉమ్మడి ఆస్తుల‌ విలువ 180+ కోట్లు. వారి వ్యక్తిగత ఆస్తులు క‌లుపుకుని, వారి రాజ కుటుంబాల నుండి వచ్చిన వారసత్వ సంప‌ద‌ల‌తో పాటు ఇంత ఆస్తి ఉంది. ఈషా తన తండ్రి ధర్మేంద్ర .. తల్లి హేమ మాలిని ఆస్తుల నుండి వారసత్వంగా పొందుతుంది. భరత్ కూడా తన కుటుంబ ఆభ‌ర‌ణాల‌ వ్యాపారంలో వారసత్వాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఇషా డియోల్- భరత్ తఖ్తానీల వ్యక్తిగత ఆస్తులకు పెద్ద తేడాలు ఉన్నాయి.

ఇషా డియోల్ ఆస్తి 8.3 శాతం మాత్ర‌మే:

పాపుల‌ర్ జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. ఈషా డియోల్ నికర ఆస్తుల‌ విలువ కేవలం 15 కోట్లకు దగ్గరగా ఉంది. ఈ సంఖ్య భారత్ తఖ్తానీతో కలిపి ఆమె నికర విలువలో దాదాపు 8 శాతానికి చేరువ‌గా ఉంది. ఈషా వివాహం తర్వాత పని నుండి విరామం తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితం టీవీ షోలు, షార్ట్ ఫిల్మ్‌ల తో తిరిగి కంబ్యాక్ అయింది.

భారత్ తఖ్తానీ సామ్రాజ్యం

భారత్ తఖ్తానీ నికర ఆస్తుల‌ విలువ దాదాపు 165 కోట్లు. అతడి బ్యాంగిల్ వ్యాపారం అతి పెద్ద‌ ఆస్తి. జువెల‌రీ తయారీ సెటప్ గొప్ప‌ది. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. సుమారు 400+ మంది సిబ్బందితో 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థ‌ విస్తరించి ఉంది. అతడు మిడిల్ ఈస్ట్ మార్కెట్ అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి దుబాయ్‌లో ఒక తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇషా డియోల్ వార్షిక ఆదాయం

ఈషా డియోల్ 2002లో బోనీ కపూర్ నిర్మించిన కోయి మేరే దిల్ సే పూచే చిత్రంతో సినీరంగప్రవేశం చేసింది. అటుపై ధూమ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధూమ్ లో ఈషా అందం స్పెష‌ల్ ట్రీట్ అని చెప్పాలి. ఆ రోజుల్లో ప్రతి సినిమాకు 2 - 3 కోట్లు పారితోషికం అందుకుంది ఈషా. కానీ ఆమె పెళ్లి తర్వాత విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. వరుసగా 2017, 2019లో తన కుమార్తెలు రాధ్య - మిరయాలను స్వాగతించింది. ఈషా రోడీస్ X2లో గ్యాంగ్ లీడర్‌గా ప్రవేశించింది. స్టంట్ ఆధారిత ట్రావెల్ రియాలిటీ షో కోసం ఒక్కో ఎపిసోడ్‌కు 10 - 12 లక్షలు అందుకుంది. ఆమె చివరిగా హంటర్: టూటేగా నహీ తోడేగా, అమెజాన్ మినీలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈషా డియోల్ న‌ట‌న‌లోకి కంబ్యాక్ అయ్యేందుకు ప్రణాళిక‌ల్లో ఉంది.