నటి విడాకుల వెనక టాప్ సీక్రెట్ లీక్
ఈషా- భరత్ విడాకుల గురించి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పరం స్నేహపూర్వకంగా" విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
By: Tupaki Desk | 7 Feb 2024 11:21 AM GMTపాపులర్ బాలీవుడ్ స్టార్లు ధర్మేంద్ర - హేమ మాలిని కుమార్తె, నటి ఈషా డియోల్ మంగళవారం తన భర్త భరత్ తఖ్తానీ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. వీరిద్దరూ 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈషా- భరత్ విడాకుల గురించి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పరం స్నేహపూర్వకంగా" విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఈషా- భరత్ జంటకు ఇద్దరు ఆడపిల్లలు రాధ్యా -మీరయా ఉన్నారు. 2020లో ఈషా ''అమ్మా మియా: స్టోరీస్, అడ్వైస్ అండ్ రెసిపీస్ ఫ్రమ్ వన్ మదర్ టు మదర్'' అనే పుస్తకాన్ని రాసింది. అందులో తమ రెండవ కుమార్తె పుట్టిన తర్వాత భారత్ ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాడో రాసింది.
నా రెండవ బిడ్డ తర్వాత కొంతకాలానికే భరత్ నాతో పిచ్చిగా చిరాకుగా ఉన్నాడని నేను గమనించాను అని ఈషా తన పేరెంటింగ్ బుక్‌లో రాసింది. నేను అతడి విషయంలో తగినంత శ్రద్ధ చూపడం లేదని అతడు భావించాడు. భర్తకు ఈ విధంగా అనిపించడం చాలా సహజం.. ఎందుకంటే ఆ సమయంలో, నేను రాధ ప్లేస్కూల్ ని నిర్వహించడం.. మిరయాకు ఆహారం ఇవ్వడం .. నా పుస్తకం రాయడం .. నా సినీనిర్మాణ సమావేశాలతో బిజీగా ఉండడం వంటి వ్యాపకాలతో బిజీలో మునిగిపోయాను. కాబట్టి అతడు దానిని నిర్లక్ష్యంగా భావించాడు. నా మార్గాల లోపాన్ని నేను వెంటనే గమనించాను. భరత్ నన్ను కొత్త టూత్ బ్రష్ అడిగాడు. అది నా మనసులో అలా ఉండిపోయింది. అతడి చొక్కాలు నలిగిపోయినపపుడు లేదా అతనికి భోజనం క్యారేజీ తనిఖీ చేయకుండా పనికి పంపినప్పుడు అన్నిటినీ నేను గుర్తుంచుకున్నాను.. అని రాసారు.
శృంగారాన్ని సజీవంగా ఉంచడానికి ఇషా ఏం చేసిందో కూడా వెల్లడించింది. అతడు చాలా తక్కువ అవసరాలు ఉన్న వ్యక్తి.. నేను అతడిని చూసుకోలేకపోతే ఏదో తప్పు జరిగింది. నేను త్వరగా దాన్ని సరిదిద్దాలని నిర్ధారించుకున్నాను.. నేను డేట్ నైట్స్ కోసం లేదా అతనితో కొంతకాలంగా సినిమా కోసం బయటకు వెళ్లలేదని నేను గుర్తించాను. కాబట్టి నేను నా ట్రాక్ నుండి బయటపడాలని నిర్ణయించుకున్నాను.. నేను మంచి దుస్తులు ధరించి వారాంతాల్లో అతనితో బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను... అని ఆ పుస్తకంలో రాసారు.
ఈషా - భరత్ విడిపోయారనే పుకార్లు చాలా కాలంగా ముఖ్యాంశాలుగా మారాయి. గత సంవత్సరం తన అత్త హేమ మాలిని పుట్టినరోజు వేడుకలో భరత్ కనిపించకపోవడంతో ఇదంతా ప్రారంభమైంది. ఈషా పుట్టినరోజు వేడుకలో కూడా అతడు కనిపించలేదు. ఇప్పుడు విడాకులను అధికారికం చేసారు.