Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆర‌బోత‌లో త‌గ్గేదేలే

ఈషా తరచుగా ఇన్ స్టాలో వేడిని పెంచుతూనే ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కార్సెట్ కో-ఆర్డ్ సెట్ లుక్ లో మ‌తి చెడే ఫోటోషూట్ ని షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 5:17 AM GMT
ఫోటో స్టోరి: ఆర‌బోత‌లో త‌గ్గేదేలే
X

బాలీవుడ్ బోల్డ్ న‌టి ఈషా గుప్తా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈషా గుప్తా తన బోల్డ్ లుక్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో బ‌జ్ క్రియేట్ చేయ‌డంలో విఫ‌లం కాలేదు. తన ఫ్యాషన్ సెన్స్ హీట్ పెంచే వేష‌ధార‌ణ ఎప్పుడూ యువ‌త‌రంలో హాట్ టాపిక్. ఈషా తరచుగా ఇన్ స్టాలో వేడిని పెంచుతూనే ఉంటుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో కార్సెట్ కో-ఆర్డ్ సెట్ లుక్ లో మ‌తి చెడే ఫోటోషూట్ ని షేర్ చేసింది.


ఈషా హాట్ లుక్ ఇంటర్నెట్‌లో సునామీ సృష్టించింది. ఇది అభిమానులను విస్మయానికి గురి చేసింది. మీరు నిజమైన అందానికి సింబ‌ల్ అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, మరొకరు ''మీరు చాలా అందంగా ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు. అద్భుతమైన సౌంద‌ర్య‌రాశి అని మ‌రొక‌రు పొగిడేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఈషా గుప్తా చివరిగా ప్రకాష్ ఝా 'ఆశ్రమ్ 3'లో కనిపించింది, ఇందులో బాబీ డియోల్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఆశ్రమం 3లో ఇమేజ్ బిల్డర్ సోనియా పాత్రను ఈషా పోషించింది. ప్రకాష్ సర్ నన్ను సోనియా పాత్రలో న‌టించే అవ‌కాశం క‌ల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది.. అని ఈషా అన్నారు.

ఇషా గుప్తా ప్ర‌స్థానం:

ఈషా గుప్తా బాలీవుడ్ న‌టి కం మోడల్. ఆమె ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2007 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ ఇంటర్నేషనల్ 2007లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2 (2012)తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఉత్తమ మహిళా డెబ్యూ నామినేషన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

గుప్తా 2007లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రవేశించింది. పోటీలో మూడవ స్థానంలో నిలిచింది. అటుపై మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకుంది. తరువాత మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఈషా గుప్తా పొలిటిక‌ల్ డ్రామా 'చక్రవ్యూహ్ '(2012)లో ఆమె పాత్రకు ప్రశంసలు అందుకుంది,.అయితే కామెడీ చిత్రం హంషాకల్స్ (2014)లో ఈషాజీ నటన ప్రతికూల సమీక్షలను అందుకుంది. హారర్ థ్రిల్లర్ రాజ్ 3D (2013), క్రైమ్ డ్రామా రుస్తోమ్ (2016), యాక్షన్-అడ్వెంచర్ బాద్‌షాహో (2017) లాంటి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లోను న‌టించింది.