Begin typing your search above and press return to search.

ఎస్తేర్ పాప న్యూ లుక్.. గ్లామర్ లో ట్రెండ్ సెట్టర్..

లెదర్ స్కర్ట్‌ లుక్ ఆమె సౌందర్యానికి సరికొత్త అనుభూతిని తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:21 PM GMT
ఎస్తేర్ పాప న్యూ లుక్.. గ్లామర్ లో ట్రెండ్ సెట్టర్..
X

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్న అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో సరికొత్తగా హైలెట్ అవుతున్నారు. ఇక అలాంటి క్యూట్ నటీమణులలో ఎస్తేర్ అనిల్ ఒకరు. అమ్మడు లేటెస్ట్ విడుదల చేసిన ఫొటోల్లో ఆమె కొత్త లుక్ నెట్టింట్లో చర్చగా మారింది. చలికాలపు ఫాషన్‌లో సరికొత్త అందాన్ని ప్రదర్శిస్తూ, బ్రౌన్ టర్టల్నెక్ మరియు లాంగ్ కోట్ తో స్టైలిష్ అవతారంలో ఆకట్టుకుంటుంది.


లెదర్ స్కర్ట్‌ లుక్ ఆమె సౌందర్యానికి సరికొత్త అనుభూతిని తీసుకొచ్చింది. ఫోటో బ్యాక్‌డ్రాప్‌గా ఉపయోగించిన ప్రకృతి అందాలు, క్యూట్ హావభావాలు నెటిజన్ల మనసులు గెలుచుకున్నాయి. ఎస్తేర్ అనిల్ తన కెరీర్‌ను చిన్నతనంలోనే ప్రారంభించినా, ప్రస్తుతానికి గ్లామర్ ప్రపంచంలో తన స్థానాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. "దృశ్యం" మూవీలో వెంకటేశ్ కూతురిగా చేసిన పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.


అప్పుడు చిన్న పాపగా కనిపించిన ఆమె, ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ గ్లామర్‌లో ట్రెండ్‌సెట్టర్ అవుతుందనే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎస్తేర్ చాలా యాక్టివ్‌గా ఉంటూ తరచూ తన తాజా ఫొటోషూట్‌లను పంచుకుంటోంది. వీటిలో ఆమె ఫ్యాషన్‌కి ఉన్న అభిరుచిని మరింత హైలైట్ చేస్తోంది. లండన్‌లోని ప్రకృతి వాతావరణంలో తీసిన ఈ ఫోటోలు ఆమె వ్యక్తిత్వాన్ని హైలెట్ చేశయు. స్టైలింగ్‌లోనే కాకుండా, ఆమె ఎక్స్ప్రెషన్స్ కాంబినేషన్ నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి.

మలయాళం మరియు తమిళ పరిశ్రమల్లో సినిమాలు చేసిన ఎస్తేర్ అనిల్, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తోంది. ఈ తరహా గ్లామర్ లుక్స్ ఆమెకు మంచి అవకాశాలు తెచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఆమెలో ఒక మంచి భవిష్యత్తు ఉన్న హీరోయిన్‌ను చూస్తున్నారు. మరి ఈ కొత్త లుక్‌తో ఎస్తర్ తన కెరీర్‌కి ఎంత పెద్ద బ్రేక్ తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఒక మలయాళం సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.