లాలిపప్ డ్రెస్ లో ఎస్తర్ క్యూట్ ఫోజులు..!
తాజాగా కూడా కొంచెం హాట్ గా, మరి కొంచెం క్యూట్ గా ఫోజులు ఇస్తూ, ఫోటోలు దిగి, వాటిని షేర్ చేసింది. వైట్ కలర్ స్కర్ట్ కి పైన మల్టీ కలర్ టాప్ కాంబినేషన్ సెట్ చేసింది.
By: Tupaki Desk | 22 Aug 2023 6:03 AM GMTచైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీన్ మొదలుపెట్టింది ఎస్తర్ అనిల్. దృశ్యం మూవీతో ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. మళయాళంలో ఏ పాత్ర చేసి ఆకట్టుకుందో, తెలుగులో దృశ్యం రీమేక్ లోనూ ఈ చిన్నారే నటించింది. దీంతో, ఇక్కడ కూడా ఆమెకు మంచి ఐడెంటిటీ వచ్చింది. ఎక్కువగా ఎస్తర్ అనే పేరు కంటే, దృశ్యం వెంకీ కూతురు అంటేనే ఎక్కువ మంది గుర్తుపడతారు. అంతలా తన పాత్రలో ఒదిగిపోయింది.
అయితే, ఆ చిన్నపాప అని తీసిపారేయకండి. ఇప్పుడు ఆ చిన్నపాపే ఇదిగో ఇలా తయారైంది. చైల్డ్ ఆర్టిస్ట్ యుగం ముగిసింది. ఇఫ్పుడు హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
హీరోయిన్ కి కావాల్సిన అన్ని ఫీచర్లు తనకు ఉన్నాయి అని తెలిసేలా మెస్మరైజ్ చేసేలా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా కొంచెం హాట్ గా, మరి కొంచెం క్యూట్ గా ఫోజులు ఇస్తూ, ఫోటోలు దిగి, వాటిని షేర్ చేసింది. వైట్ కలర్ స్కర్ట్ కి పైన మల్టీ కలర్ టాప్ కాంబినేషన్ సెట్ చేసింది. చిన్న పిల్లలు తినే లాలిపాప్ లో ఎన్ని రంగులు అయితే ఉంటాయో, ఈ పాప టాప్ లోనూ అంతే కలర్స్ ఉన్నాయి. అందుకే తన ఫోటోలకు క్యాప్షన్ గా లాలిపాప్ అని పెట్టింది.
అయితే, ఈ డ్రెస్ లో హెవీ మేకప్ వేయకుండా, చాలా మినిమమ్ మేకప్ తో మెరిసిపోయింది. క్యూట్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇక ఎస్తర్ మలయాళంతో పాటుగా తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకు అయితే, హీరోయిన్ గా ఆమెకు ఇంకా ఛాన్సులు రాలేదనే చెప్పాలి.
2001 ఆగస్ట్ 27న కేరళలోని యనాడ్ ప్రాంతంలో జన్మించింది ఎస్తేర్ అనిల్. 2010లో నల్లవన్ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా ఆమె కెరీర్ ని మార్చేసింది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. మొదట మళయాళం దృశ్యంలో నటించగా, తెలుగులోనూ ఆ పాత్రకు ఆమెనే తీసుకున్నారు.