మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్.. అప్పుడే బికినీ ట్విస్ట్!
మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించినవారు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు.
By: Tupaki Desk | 15 May 2024 6:47 AM GMTమొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించినవారు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఊహించిన విధంగా దర్శనమిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ తోనే వైరల్ అవుతూ ఉన్నారు. ఇక దృశ్యం సినిమాలో నటించిన వెంకటేష్ చిన్న కూతురు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మధ్య ఈ పాప సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియా లోనే ఎక్కువగా హైలెట్ అవుతోంది.
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎస్తేర్ అనిల్ 10 ఏళ్ల వయసులో కి రాకముందే బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. ఇక చిన్న తరహా క్యారెక్టర్స్ చేసుకుంటూ తన టాలెంట్ నిరూపించుకున్న ఈ చిన్నారి ఆ తర్వాత రెండు పదుల వయసులోకి రాకముందే హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు మలయాళం తమిళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అని అడుగులు వేస్తోంది.
కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ ప్రాజెక్టులను చేయాలని కూడా ఆలోచిస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ బ్యూటీ ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన సక్సెస్ అయితే దక్కలేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు తన గ్లామర్ తో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఒక వెకేషన్ కి వెళ్లిన అమ్మడు అక్కడ బికినీలో దర్శనమిచ్చింది.
అందమైన స్విమ్మింగ్ పూల్ లో లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఎస్తేర్ అనిల్ అక్కడే కాస్ట్ లీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఒక ఫోటోలో అయితే అమ్మడు బికినీలో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. నిన్న మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఎస్తేర్ అనిల్ సడన్ గా బికినీలో కనిపించేసరికి అందరూ షాక్ అవుతున్నారు.
అయితే ఈ భామ గ్లామర్ షో చేయడం కొత్తిమీ కాదు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు స్టైలిష్ డ్రెస్ లలో హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా కనిపిస్తోంది. అయితే ఈసారి సడన్ గా బికినీలో కనిపించేసరికి ఎవరు అంత ఈజీగా నమ్మలేకపోతున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం మలయాళం లోనే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ వెండితెరపై ఏ విధంగా దర్శనమిస్తుందో చూడాలి.