గుణశేఖర్ 'యుఫోరియా'.. పెద్ద పని కంప్లీట్ అయినట్లే..
ప్రముఖ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు యుఫోరియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు
By: Tupaki Desk | 26 Feb 2025 12:05 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్.. ఇప్పుడు యుఫోరియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు యుఫోరియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీలక పాత్ర పోషిస్తోంది.
గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ పై రూపొందుతున్న యుఫోరియా చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమాను అనౌన్స్ చేసి మేకర్స్ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత భూమిక సహా పలువురు నటిస్తున్న ఆ మూవీ.. శరవేగంగా షూట్ నిర్వహించారు.
ఇప్పుడు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లు వెల్లడించారు. స్పెషల్ గ్లింప్స్ ను కూడా షేర్ చేశారు. ఆత్మను కదిలించే సినిమాటిక్ ఎక్సీపీరియన్స్ మీ అందరి కోసం వేచి ఉందంటూ రాసుకొచ్చారు. గ్లింప్స్ లో పలు సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు చూపించారు. గుణశేఖర్ యాక్షన్.. అంటున్న వాయిస్ తో గ్లింప్స్ మొదలైంది.
గ్లింప్స్ లో భూమిక సహా క్యాస్టింగ్ అందరికీ సీన్స్ నరేషన్ చేస్తూ కనిపించారు గుణ శేఖర్. ఆ తర్వాత షూటింగ్ విజువల్స్ ను కొన్ని యాడ్ చేశారు. అందులో భూమిక ఓ సీన్ లో అగ్రెసివ్ గా మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. మొత్తానికి మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు.
అయితే యుఫోరియా మూవీలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్పలత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా మూవీ ఉండనుందని సమాచారం. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భూమిక కాంబో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో రూపొందిన యుఫోరియా సినిమా భూమిక, గుణశేఖర్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో వేచి చూడాలి.