Begin typing your search above and press return to search.

హిట్ టాక్ వచ్చినా.. ప్రాఫిట్ లక్కు లేదా?

భయపెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అజయ్ భూపతి మంగళవారం సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:28 AM GMT
హిట్ టాక్ వచ్చినా.. ప్రాఫిట్ లక్కు లేదా?
X

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ మంగళవారం. భయపెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అజయ్ భూపతి మంగళవారం సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. సినిమాలో చివరి 30 నిమిషాలు ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే టాక్ వచ్చింది. వరుసగా రివీల్ అయ్యే ట్విస్టులతో ఆడియన్స్ ని అజయ్ భూపతి థ్రిల్ చేశాడు.

ఈ మధ్యకాలంలో ఇన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒక విరూపాక్ష మాత్రమే వచ్చింది. దీంతో మంగళవారం మూవీ కచ్చితంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొడుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా ఆశించిన స్థాయిలో సినిమాకి కలెక్షన్స్ రావడం లేదని తెలుస్తుంది. ఇప్పటివరకు ఆరు రోజుల్లో మంగళవారం కలెక్ట్ చేసిన గ్రాస్ మొత్తం 15.12 కోట్లు మాత్రమే. షేర్ పరంగా చూసుకుంటే 7.96 కోట్లు వచ్చింది.

ఈ మూవీ థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టాలంటే ఇంకో 5.04 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది చెప్పలేని పరిస్థితి. ఆరు రోజులు కంప్లీట్ అయిపోవడంతో మెజారిటీ ఆడియన్స్ సినిమాని థియేటర్స్ లో చూసేసారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూసుకోవచ్చని భావిస్తున్న వాళ్లే.

నిజంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోవడం నిర్మాతలని కలవరపెట్టే అంశం అని చెప్పాలి. హిట్ టాక్ వచ్చిన కూడా ప్రాఫిట్ రాని సినిమాల జాబితాలో మంగళవారం చేరిపోయే అవకాశం కనిపిస్తుంది. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతికి మంగళవారం మూవీ కొంత ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు.

ఈ మధ్యకాలంలో సస్పెన్స్ త్రిల్లర్ కథలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అజయ్ భూపతికి మరిన్ని అవకాశాలు మంగళవారం మూవీ తెచ్చి పెడుతుందనే మాట వినిపిస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ రాజ్ పుత్ కి కూడా మంగళవారం మంచి సంతృప్తిని ఇచ్చిన మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా ఆమె కెరీర్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడే చెప్పలేని విషయం.