Begin typing your search above and press return to search.

ప్రతి సీన్ ఓ ఇంటర్వెల్.. పుష్ప 2 హైప్ పెంచేస్తున్న డిఎస్పి..!

పుష్ప 2 పై దేవి ఇలాంటి కామెంట్ చేయడం సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కూడా జోష్ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   15 Nov 2023 2:30 AM GMT
ప్రతి సీన్ ఓ ఇంటర్వెల్.. పుష్ప 2 హైప్ పెంచేస్తున్న డిఎస్పి..!
X

సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కేలా చేసింది. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్.. దేవి శ్రీ అదరగొట్టే మ్యూజిక్.. అల్లు అర్జున్ మెస్మరైజ్ యాక్టింగ్ ఇవన్నీ కలిపి పుష్ప 1 ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక ఇప్పుడు అదే అంచనాలతో పార్ట్ 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్ 2 విషయంలో సుకుమార్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పార్ట్ 2 పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

పార్ట్ 2 సినిమా గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ తెచ్చాయి. సుకుమార్ పార్ట్ 2 కథను తనకు చంద్రబోస్ కి కలిసి చెప్పారు. ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే కూడా ప్రతి సీన్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉంటుందని అన్నారు. ఈ క్లిప్ ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పుష్ప 2 పై దేవి ఇలాంటి కామెంట్ చేయడం సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కూడా జోష్ ఇస్తుంది.

పుష్ప 2 లో జాతర సీన్ సినిమాకే హైలెట్ గా ఉండబోతుందని తెలిసిందే. అల్లు అర్జున్ గంగమ్మ వేషధారణలో గూస్ బంప్స్ తెప్పిస్తాడని అంటున్నారు. పోస్టర్ తోనే పూనకాలు తెప్పించేసిన బన్నీ సినిమాలో ఆ ఎపిసోడ్స్ లో ప్రేక్షకులకు మెంటల్ ఎక్కించే పర్ఫార్మెన్స్ ఇస్తాడని అంటున్నారు. పుష్ప 1 లోని సాంగ్స్ కి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప రాజ్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లో కూడా శ్రీవల్లి స్టెప్ ని రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఇక పుష్ప రాజ్ తగ్గేదేలే అయితే కొందరికి ఊతపదం అయ్యింది. ఇప్పుడు దేవి ఇచ్చిన హింట్స్ తో పుష్ప 2 మరో సెన్సేషనల్ అవ్వబోతుందని అర్థమవుతుంది. పుష్ప 2 సినిమా 2024 ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుండగా అది ఎవరు చేస్తున్నారు అన్న విషయం మాత్రం క్లారిటీ రాలేదు.