కళను రాజకీయ కోణంలో చూస్తాను: పా.రంజిత్
ఐఏఎన్ఎస్‌తో పా. రంజిత్ మాట్లాడుతూ-''రాజకీయాల్ని లోతుగా చూస్తే, భారతదేశ సామాజిక నిర్మాణం కళాకారులకు రాజకీయంగా ఉండటమే తప్ప వేరే ఎంపికకు ఆస్కారం లేద''ని అన్నారు.
By: Tupaki Desk | 8 Sep 2024 3:30 PM GMTతాను కళను రాజకీయ కోణంలో చూస్తానని, నాకు ప్రతిదీ రాజకీయమేనని దర్శకుడు పా.రంజిత్ అన్నారు. ఇటీవల తంగళన్ చిత్రంతో ఘనవిజయం అందుకున్న అతడు ఐఎఎన్ఎస్‌తో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. పా రంజిత్ కుల ఆధారిత అణచివేతకు వ్యతిరేకంగా తన బలమైన స్వరాన్ని వినిపించడంలో ప్రసిద్ధి చెందాడు. అతడు సినిమా అనే కళారూపంలోను దీనిని ప్రదర్శిస్తున్నాడు. తంగళన్ లో కూడా కులం అనే అంశం ఉంది. అయితే అది బౌద్ధమతాన్ని కూడా స్పర్శించింది.
ఐఏఎన్ఎస్‌తో పా. రంజిత్ మాట్లాడుతూ-''రాజకీయాల్ని లోతుగా చూస్తే, భారతదేశ సామాజిక నిర్మాణం కళాకారులకు రాజకీయంగా ఉండటమే తప్ప వేరే ఎంపికకు ఆస్కారం లేద''ని అన్నారు. నాకు ప్రతిదీ రాజకీయమే. భారతదేశంలో మొత్తం వ్యవస్థ రాజకీయాలపై ఆధారపడి ఉంటుంది. కుల వ్యవస్థ - వర్గ వ్యవస్థను బట్టి మనం ఉదాసీనతను ఫాలో అవుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. మనది పెద్దలు సూచించిన ఆచారాల వ్యవస్థ. ఆచారాలను అనుసరించే దేశం.. అని అన్నారు.
మన ఆలోచనలు మతపరమైన విషయాలు, కులాల గురించి సాగుతాయి. భారతీయులుగా మనం చాలా వేరుగా ఉన్నామని పా రంజిత్ పేర్కొన్నారు. కులం, మతం అనే కోణంలో ప్రతి ఒక్కరూ అస్తిత్వం అనే కాలపు ఇసుకతో కొట్టుకుపోతుంది!.. అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఒక గ్రామంలోని ప్రతి చెట్టు వెనుక ఒక కథ ఉంటుంది. అది అణచివేతను చూసింది. ప్రజల ఎదుగుదలను చూసింది. ఆర్టిస్ట్‌గా నాకు ఆసక్తి కలిగించే అంశాలు ఇవి. నా కళ ద్వారా నేను అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. నేను బోధకుడిగా ఉండాలనుకోవడం లేదు.. కానీ ప్రేక్షకులు నా పనిని చూసి వారి మెదడును ఉపయోగించి ఒక నిర్ణయానికి రావాలని.. సమాజంలో విషయాలను సరిగ్గా సెట్ చేయడానికి ప్రేరణ పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన తంగళన్ పెద్ద విజయయం సాధించింది. తంగళన్ హిందీ వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది.
నీలం కల్చరల్ సెంటర్ అనే ఒక సంస్థను కూడా పా రంజిత్ నడుపుతున్నారు. ఇది మద్రాస్ రికార్డ్స్ అనే మ్యూజిక్ లేబుల్‌తో కలిసి నలుగురు రాపర్లు, ఏడుగురు వాయిద్యకారులు.. ఎనిమిది మంది గాన సంగీతకారులతో కూడిన ది కాస్ట్‌లెస్ కలెక్టివ్ అనే 19-పీస్ బ్యాండ్ .. ఇది తమిళనాడులో ప్రసిద్ధ జానపద సంగీత శైలిని కలిగిన మ్యూజిక్ సంస్థ.