Begin typing your search above and press return to search.

'ఎక్స్​ ట్రా'.. నితిన్ క్లాసీ లుక్​ సూపర్​

గ్రీన్ కలర్​ షర్ట్​, బ్లాక్ కలర్ ఫార్మల్​ ప్యాంట్​, చేతికి వాచ్​, చెవిలో బ్లూ తూత్​, నైస్ హెయిర్​ స్టైల్​తో ఆకట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 8:42 AM GMT
ఎక్స్​ ట్రా.. నితిన్ క్లాసీ లుక్​ సూపర్​
X

టాలీవుడ్ హీరో నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎక్స్​ ట్రా'.. ఆర్డినరీ మేన్‌ ట్యాగ్ లైన్. ఈ చిత్రం తుది దశకు చేరుకుంటోంది. డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్‌ 32వ చిత్రమిది. ఇందులో ఆయన రెండు రకాల పాత్రలతో సందడి చేస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.


అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మూవీటీమ్ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో నితిన్ ఊబర్ లుక్ అదిరిపోయింది. గ్రీన్ కలర్​ షర్ట్​, బ్లాక్ కలర్ ఫార్మల్​ ప్యాంట్​, చేతికి వాచ్​, చెవిలో బ్లూ తూత్​, నైస్ హెయిర్​ స్టైల్​తో ఆకట్టుకున్నారు. కూల్​గా విజిల్ వేస్తూ ఎంతో క్లాసీగా కనిపించారు. ఈ పోస్టర్​ సినీ ప్రియులకు ఆకట్టుకునేలా మంచిగా నితిన్ డ్రెస్సింగ్​కు మ్యాచ్​ అయ్యేలా కలర్​ ఫుల్​గా డిజైన్ చేశారు మేకర్స్​.

అంతకుముందు గతంలో రిలీజ్ చేసిన పోస్టర్​లో అయితే గుబురు గడ్డం లుక్ పక్కా మాస్ అవతార్​లో కనిపించారు నితిన్​. ఇప్పుడా లుక్​కు పొంతన లేకుండా ఎంతో కూల్​గా సూపర్ స్టైలిష్​గా కనిపించి ఫిదా చేశారు. కాబట్టి ఈ రెండు పోస్టర్లను చూస్తే.. నితిన్​ డ్యూయల్ రోల్ చేయబోతున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. లేదంటే ఒకే పాత్రలోనే రెండు లుక్స్​తో కనపడతారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

ఇకపోతే ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నారు. పాత్ర ప్రధానమైన కథతో ఈ చిత్రం రూపొందుతోందని, సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తూ, ఆశ్చర్యపరుస్తూ ఓ విభిన్నమైన అనుభూతిని పంచుతుందని మూవీటీమ్ చెబుతోంది. అలాగే నితిన్‌ ఇప్పటివరకూ చేయని ఓ సరికొత్త పాత్రలో కనిపిస్తారని కూడా సినీ వర్గాలు అంటున్నాయి.

ఈ చిత్రానికి హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్​గా రిలీజైన డేంజర్ పిల్ల సాంగ్​కు ఆయన అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. నితిన్, శ్రీలీల జోడీ కూడా బాగా ఆకట్టుకుంది. పాటలోని లొకేషన్స్​ కూడా ఎంతో అందంగా కనిపించాయి. ఈ పాటను అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడాడు. మొత్తంగా ఈ సాంగ్​ శ్రోతలను బాగా ఆకట్టుకుంది.