Begin typing your search above and press return to search.

ఎక్స్ ట్రా… నవ్వకపోతే డబ్బులు మీవే

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా ఎక్స్ట్రార్డినరీ

By:  Tupaki Desk   |   3 Dec 2023 7:13 AM GMT
ఎక్స్ ట్రా… నవ్వకపోతే డబ్బులు మీవే
X

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా ఎక్స్ట్రార్డినరీ. హోం ప్రొడక్షన్ లోనే ఈ సినిమాని నితిన్ తండ్రి నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ని మంచి రెస్పాన్స్ వస్తోంది. నా పేరు సూర్య సినిమా తర్వాత వక్కంతం వంశీ సీనియస్ కథని తీసుకోకుండా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ని ట్రై చేశారు.

ఈ సినిమా ప్రమోషన్స్ ని నితిన్ జోరుగా చేస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీలో నితిన్ కి జోడీగా నటిస్తోంది. ఈ మధ్యకాలంలో కమర్షియల్ కామెడీకి ఆడియన్స్ పట్టం కడుతున్నారనే సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన మ్యాడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మ్యాడ్ చూసిన వాళ్ళు నవ్వకుండా బయటకొస్తే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని చాలెంజ్ చేశారు. నాగ వంశీ కామెంట్స్ కూడా మ్యాడ్ సినిమాకి ఆడియన్స్ పెరగడంలో హెల్ప్ అయ్యింది. తాజాగా నితిన్ కూడా అలాంటి కామెంట్స్ చేయడం విశేషం. నితిన్ లో హ్యూమర్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సినిమా ప్రమోషన్స్ లో పంచ్ లు వేసి నవ్విస్తూ ఉంటారు.

తన ఎక్స్ట్రార్డినరీ మూవీ కూడా ప్రేక్షకులని ఆద్యంతం నవ్విస్తుందని. ఎవరైనా నవ్వకుండా థియేటర్స్ నుంచి బయటకొస్తే టికెట్ డబ్బులు నాగ వంశీ వాపస్ ఇస్తారని అన్నారు. నాగవంశీకి నాకు లావాదేవీలు చాలా ఉన్నాయని, అందుకే అతనే చెల్లిస్తాడు అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై నాగ వంశీ రియాక్ట్ అయ్యి అప్పుడేదో సినిమా ప్రమోషన్ మూడ్ లో ఉండి అలా వాగేసా. ఇలా తనని లాక్ చేస్తే ఎలా అంటూ ఎమోజీ పెట్టి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మధ్య నితిన్ తాను చేసిన మాస్ సినిమాల విషయంలో కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. మాస్ సినిమాలు తనకి సెట్ కావని, ఇకపై అలాంటి కథలు చేసే ప్రయత్నం చేయనని, ఎంటర్టైనర్ మూవీస్ తోనే వస్తానని చెప్పుకొచ్చారు.