Extra ఆర్డినరీ మ్యాన్.. కెరీర్ లోనే బెస్ట్..!
నితిన్, రావు రమేష్ ఈ రేంజ్ లో చెబుతున్నారు అంటే కచ్చితంగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంది.
By: Tupaki Desk | 24 Nov 2023 12:32 PM GMTనితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రైటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు ఇచ్చిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా చేసిన తొలి ప్రయత్నం నా పేరు సూర్య. అల్లు అర్జున్ లీడ్ రోల్ లో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
ఆ తర్వాత రెండో సినిమాను చేసేందుకు చాలా టైం తీసుకున్నాడు వక్కంతం వంశీ. నితిన్ లీడ్ రోల్ లో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ ఒక క్రేజీ మూవీతో వస్తున్నారు. డిసెంబర్ 8న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో సినిమా హీరో నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన రావు రమేష్ ముగ్గురు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటిస్తున్న రావు రమేష్, నితిన్ ల మధ్య సీన్స్ చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు.
సినిమాలో రావు రమేష్ పాత్ర చాలా వెరైటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి తండ్రి పాత్రలో తను చేసిన ఈ సినిమాలోని పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు రావు రమేష్. అంతేకాదు నితిన్ తో తన సీన్స్ చాలా బాగా వచ్చాయని అన్నారు. నితిన్ కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ కూడా చాలా బాగా అలరిస్తుందని అన్నారు. 20 ఏళ్ల కెరీర్ లో తను చేసిన 31 సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు నితిన్.
నితిన్, రావు రమేష్ ఈ రేంజ్ లో చెబుతున్నారు అంటే కచ్చితంగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసే ఛాన్స్ ఉంది. కిక్, రేసుగుర్రం సినిమాల తరహాలోనే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు వక్కంతం వంశీ. నితిన్ కూడా సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది. సినిమాలో అన్ని బాగా కుదిరాయి అన్నారు.
ఇక సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నిలుస్తారని అన్నారు. సినిమాలో ఆయన కూడా ఎంటర్టైన్ చేస్తారని. ఆయన సినిమాలో నటించడం ప్లస్ పాయింట్ అని అన్నారు. హీరో నితిన్ సినిమా బాగా వచ్చేందుకు మిగతా పాత్రలు కాస్త డామినేట్ చేసినట్టు అనిపించినా హీరోగా అతను ఏమి అడ్డు చెప్పలేదని రావు రమేష్ అన్నారు.