Begin typing your search above and press return to search.

ఎక్స్ ట్రా ట్రెండ్ ని పట్టుకున్న నితిన్

అయితే ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలని తన సక్సెస్ ఫార్ములా కామెడీని అండ్ యాక్షన్ ని ఎక్స్ ఆర్డినరి మెన్ లో ట్రై చేశాడు

By:  Tupaki Desk   |   9 Dec 2023 5:03 AM GMT
ఎక్స్ ట్రా ట్రెండ్ ని పట్టుకున్న నితిన్
X

ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు నితిన్. జయం మూవీతో కెరియర్ స్టార్ట్ చేసిన నితిన్ తరువాత దిల్ తో వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు. అనంతరం కెరియర్ లో ఎక్కువగా కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు మాస్ యాక్షన్ చిత్రాలు చేశారు. ఇవన్నీ డిజాస్టర్ అయ్యాయి.

చాలా కాలం తర్వాత ఇష్క్ మూవీతో రొమాంటిక్ కామెడీ ట్రై చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ గుండెఝారి గల్లంతయ్యిందే మూవీతో మరో హిట్ అందుకున్నాడు. రొమాంటిక్ కామెడీ అండ్ యాక్షన్ చిత్రాలతో నితిన్ కి ఎక్కువ హిట్ వచ్చాయి. డిఫరెంట్ గా ట్రై చేసిన, మాస్ కమర్షియల్ చేసిన ఫెయిల్యూర్ తప్పలేదు. భీష్మతో హిట్ కొట్టిన తర్వాత వరుసగా మూడు ఫ్లాప్ లు సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలని తన సక్సెస్ ఫార్ములా కామెడీని అండ్ యాక్షన్ ని ఎక్స్ ఆర్డినరి మెన్ లో ట్రై చేశాడు. ఈ సినిమా తాజాగా రిలీజ్ అయ్యి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మూవీలో కామెడీ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అన్ని రకాల కామిక్ మీమ్స్ ని వక్కంతం వంశీ ఫుల్ గా వాడేసాడు. ఈ కామిక్ ఎలిమెంట్స్ అన్ని కూడా సినిమాకి బలాన్ని ఇచ్చాయి.

రాజశేఖర్ మీద పేల్చిన జీవిత జోక్, అలాగే బాలయ్య ఫ్యాన్స్ ని ఎందుకు కొడతాడు అంటూ ట్రెండ్ అయ్యే ప్రశ్న, దానికి ఫ్యాన్స్ అబ్బనీ తీయనీ దెబ్బలా ఉంటుంది అంటూ చిరంజీవి, శ్రీదేవిని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం, పవిత్ర లోకేష్ తో ఈ వయస్సులో విజయ నిర్మల గారి అబ్బాయికి పెళ్లి ఎందుకని అడిగించడం, విజయ్ దేవరకొండ, రాష్మిక గాసిప్ లవ్ స్టొరీ గురించి కామెడీ డైలాగ్స్ తో ట్రై చేశారు. ఇవన్నీ సినిమాలో భాగా పేలాయి.

అలాగే థర్టీ ఇయర్స్ పృథ్వీని ఉద్దేశించి వెనక నుంచి పట్టుకుంటావా అంటూ సెటైరికల్ గా వాడే డైలాగ్ కూడా పేలింది. ఇవన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే టాపిక్స్. వీటిని వక్కంతం వంశీ ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ లో నితిన్ కోసం ఫుల్ గా ఉపయోగించాడు. వీటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ కామెడీ ట్రాక్ తో నితిన్ ఎంత వరకు సక్సెస్ అందుకుంటాడు అనేది వేచి చూడాలి.