Begin typing your search above and press return to search.

ఆయ్.. ఇది మరో గుడ్ న్యూస్

ఇక హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమివ్వడంతో నిర్మాతలు ఆడియెన్స్ కోరిక మేరకు షోలు పెంచేందుకు రెడీ అయ్యారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 7:30 AM GMT
ఆయ్.. ఇది మరో గుడ్ న్యూస్
X

ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ఒకేసారి డిఫరెంట్ సినిమాలు పోటీకి దిగాయి. అయితే ఈ పోటీలో కమర్షియల్ సినిమాల కంటే తెలుగు నెటీవీటి ఉన్న "ఆయ్" సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ వినోదాత్మక డ్రామా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలోని హాస్య ప్రధాన సన్నివేశాలు, ఆకట్టుకునే పాత్రలతో ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశారు.

మొదటి రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించిన "ఆయ్" సినిమా, మూడవ రోజు ఆకస్మాత్తుగా వసూళ్లను భారీగా పెంచుకుంది. ఈ సమాచారం నిర్మాతలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో 14 అదనపు షోలు జోడించబడ్డాయి. అసలైతే ముందుగానే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి షోలు పెంచాలని డిమాండ్ వచ్చింది.

ఇక హౌస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమివ్వడంతో నిర్మాతలు ఆడియెన్స్ కోరిక మేరకు షోలు పెంచేందుకు రెడీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరిన్ని థియేటర్లలో ప్రదర్శనలు కలిపి, ప్రేక్షకులకు మరింత చేరువ కావాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ సినిమా ఆదివారం భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదే జోరు కొనసాగితే, సోమవారం కూడా సినిమా చాలా మంచి కలెక్షన్లను నమోదు చేసే అవకాశముంది. "ఆయ్" సినిమాను అంజి కె. మణిపుత్ర డైరెక్ట్ చేయగా నార్నె నితిన్, నయన్ సారిక, కాశిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయ్య, వినోద్ కుమార్, మైమ్ గోపి వంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు.

బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకి రామ్ మిరియాల మరియు అజయ్ అరసాడ సంగీతం అందించారు. ప్రేక్షకుల ఆదరణకు నిదర్శనం గా, సినిమా మొదట్లోనే మంచి వసూళ్లు సాధించడంతో, నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా ఆకర్షణీయమైన కథ, వినోదంతో కూడిన సన్నివేశాలు, గ్రామీణ నేపథ్యం కలిపి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమైంది. "ఆయ్" సినిమా ఒక బిగ్ హిట్ అవుతుందన్న విశ్వాసంతో నిర్మాతలు ఉన్నారు.