Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో షెకావ‌త్ స‌ర్ కి కొత్త చాన్సులు నిల్!

ఫ‌హాద్ పాజిల్ మ‌ల‌యాళంలో ఎంతో పేరున్న న‌టుడు. అక్క‌డ ఫ‌హాద్ కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 5:30 PM GMT
టాలీవుడ్ లో షెకావ‌త్ స‌ర్ కి కొత్త చాన్సులు నిల్!
X

ఫ‌హాద్ పాజిల్ మ‌ల‌యాళంలో ఎంతో పేరున్న న‌టుడు. అక్క‌డ ప‌హాద్ కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. హీరోగా ఎన్నో సినిమాలు చేసాడు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడు. న‌టుడిగా చిన్న వ‌య‌సులోనే బీజం ప‌డింది. ఫ‌హాద్ చైల్డ్ ఆర్టిస్ట్ కావ‌డంతోనే అంత‌టి గుర్తింపు అక్క‌డ‌. త‌మిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసాడు. ఇక `పుష్ప` సినిమాతో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయ్యాడు. సౌత్ లో అన్ని భాష‌ల‌కు మ‌రింత చేరువ‌య్యాడు. `పుష్ప` స‌క్సెస్ త‌ర్వాత మ‌ల‌యాళం సినిమాలు తెలుగులోకి అనువాదం అవ్వ‌డం మొద‌లైంది.

ఇలా ఒక్క స‌క్సెస్ అతడికి ద‌క్షిణాదిన మ‌రింత గుర్తింపు తీసుకొచ్చింది. కానీ తెలుగులో మాత్రం బిజీ విల‌న్ కాలేక‌పోయాడు? అన్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. `పుష్ప‌`లో బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లం దుకున్నాడు. తెలుగు ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యాడు. `పుష్ప‌-2` విజ‌యంతో ఆ ఇమేజ్ రెట్టింపు అయింది. కానీ ఇక్క‌డ మాత్రం బిజీ విల‌న్ కాలేదు. సాధార‌ణంగా అంత పెద్ద పాన్ ఇండియా స‌క్సెస్ వ‌చ్చిన త‌ర్వాత తెలుగు ద‌ర్శకులు అలాంటి విల‌న్ కోసం క్యూ క‌డ‌తారు.

కానీ ఫ‌హాద్ విష‌యంలో ఆ స‌న్నివేశం చోటు చేసుకోలేదు. `యానిమ‌ల్` అనే హిందీ విజ‌యంతో బాబి డియోల్ తెలుగు, త‌మిళ్ లో బిజీ అయ్యాడు. `డాకు మ‌హారాజ్`, `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో లో విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఇవి గాక బాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు చేస్తున్నాడు. వీట‌న్నింటి కంటే ముందే సూర్య `కంగువ‌`లో విల‌న్ గా న‌టిం చాడు. `యానిమ‌ల్` అనే కంబ్యాక్ సినిమాతోనే? బాబి డియోల్ ఇంత సాధించాడు.

అప్ప‌టి వ‌ర‌కూ బాబికి స‌రైన అవ‌కాశాలు కూడా రాలేదు. కానీ ప‌హాద్ అంత ఫేమ‌స్ న‌టుడైనా తెలుగులో చూస్తే సినిమాలే క‌నిపించ‌లేదు. `డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్`, `ఆక్సిజ‌న్` అనే సినిమాల‌కు సైన్ చేసాడు. కానీ ఆ ప్రాజెక్ట్ లు డిలే అవుతున్నాయి. మ‌రెందుకు ప‌హాద్ రేసులో వెనుక‌బ‌డుతున్నాడు. అవ‌కాశాలు రాక‌? వ‌చ్చిన అవ‌కాశాలు కాద‌న‌డం వ‌ల్ల అన్న‌ది తెలియాలి.