సుకుమార్ ఆ విషయాన్ని ముందే చెప్పారు : ఫఫా
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ... రంగస్థలం సినిమా చూసిన సమయంలోనే సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది.
By: Tupaki Desk | 9 Dec 2024 4:44 AM GMTపుష్ప 2 సెన్షేషన్ హిట్ కొట్టింది. మొదటి మూడు రోజుల్లో రూ.621 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబోలో ఇది నాల్గవ హిట్. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో 50 నుంచి 60 శాతం రాబట్టిన పుష్ప వచ్చే వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే ఆయన ఏ ఒక్క ప్రమోషన్ ఈవెంట్‌కి రాకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన పుష్ప 2 ఈవెంట్స్‌కి హాజరు కాలేదని చిత్ర యూనిట్ సభ్యుల వారు చెబుతూ వస్తున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ... రంగస్థలం సినిమా చూసిన సమయంలోనే సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చింది. ఆయనతో వర్క్ చేయాలి అనుకున్నాను. పుష్ప కోసం సంప్రదించినప్పుడు కాదు అనలేక పోయాను. పుష్ప సినిమా కథ చెప్పిన సమయంలోనే ఆయన నాతో డైలాగ్స్, సీన్ల విషయంలో ఇప్పుడే ఫిక్స్ అయిపోవద్దు, సెట్‌లో అప్పటికప్పుడు సీన్స్, డైలాగ్స్ మార్చే అవకాశాలు ఉంటాయి. వాటికి ప్రిపేర్ కావడానికి కావాల్సినంత సమయం ఇస్తాం. ఒకవేళ ఆ రోజు ప్రిపేర్ కాలేక పోతే ఆ రోజు షూటింగ్ ఆపేసి తర్వాత రోజు షూటింగ్ చేద్దాం అని అన్నారు.
దర్శకుడు అంత స్వేచ్ఛ ఇవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక సీన్ లేదా డైలాగ్ ప్రిపేర్ కావడానికి ఎంత సమయం అయినా తీసుకోమని ఆయన చెప్పేవారు. పుష్ప కోసం ఆయన ఎంతగా రీసెర్చ్ చేశారో దగ్గరగా చూశాను. ఒక సినిమా కోసం దర్శకుడు ఇన్ని విషయాలు తెలుసుకుంటారా అనిపించింది. ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ పై సేకరించిన సమాచారంతో నెట్ ఫ్లిక్స్ కోసం ఏకంగా ఒక డాక్యుమెంటరీని రూపొందించబోతున్నారు. ఆయన వద్ద అంతటి సమాచారం సినిమా కోసం ఉంది. సినిమాకు వాడుకోగా ఇంకా చాలా సమాచారం ఆయన వద్ద ఉండటం వల్ల డాక్యుమెంటరీని చేయబోతున్నారని ఫఫా అన్నారు.
ఫహద్ ఫాజిల్ గురించి సుకుమార్ గురించి మాట్లాడుతూ ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, తనకున్న చెడ్డ అలవాటుతో సీన్స్, డైలాగ్స్ అప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాను, అందుకు ఆయన ఇబ్బంది పడకుండా, భాష రాకున్నా ఆ సీన్స్‌ను అర్థం చేసుకుని చేసే విధంగా నచ్చేది. ఆ రోజే ఆ సన్నివేశాలను చేసేందుకు రెడీ అయ్యేవారు. ఆయన ప్రతి విషయంలోనే చాలా సహకరించారని సుకుమార్ అన్నారు. తెలుగులో ఫఫా మరిన్ని సినిమాలు చేయాలని ప్రేక్షకులు, సినీ వర్గాల వారు కోరుకుంటున్నారు.