Begin typing your search above and press return to search.

ఫహద్ ఫాజిల్ తో RGV - ఏంటీ సడన్ సర్ ప్రైజ్?

ఇటీవలే ప్రముఖ మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, వర్మను కలిసి అతని డెన్‌లో ఒక ప్రత్యేకమైన సందర్శన చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 11:29 AM GMT
ఫహద్ ఫాజిల్ తో RGV - ఏంటీ సడన్ సర్ ప్రైజ్?
X

సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక తన డెన్‌ లో అనుకోకుండా స్టార్‌లను ఆహ్వానిస్తూ, వార్తలలో నిలుస్తున్నారు. చాలా కాలంగా వర్మ తన రేంజ్ కి తగ్గట్లుగా సినిమాలు తీయడంలో విఫలమవుతూ ఉన్నాడు. అయినప్పటికీ, ఇండస్ట్రీలో వర్మకు ఉన్న ప్రత్యేకమైన శైలి, అతని ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇటీవలే ప్రముఖ మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, వర్మను కలిసి అతని డెన్‌లో ఒక ప్రత్యేకమైన సందర్శన చేసినట్లు తెలుస్తోంది. ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, తన నటనతో అందరి మన్ననలూ పొందుతూ దూసుకుపోతున్నాడు. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, అలాగే నటనలో తనకు ఉన్న ప్రత్యేకతతో ఒక స్ట్రాంగ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఫహద్ ఫాజిల్ ఆర్జీవీ డెన్ కు వెళ్లి ఆర్జీవీతో ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నాడు. ఆర్జీవీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫహద్ ఫాజిల్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ, "మా ఇద్దరి ఫోటో చూస్తే సినిమా షూట్ అనుకున్నారా? అది కేవలం నన్ను కలిసేందుకు ఆయన వచ్చాడు," అని స్పష్టం చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫహద్‌తో వర్మ కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారా? అనే చర్చలు తెరపైకి వస్తున్నాయి.

ఎందుకంటే వర్మతో కలిసి పనిచేయడం అనేది అందరికీ పెద్ద చాలెంజ్ గా మారింది. ఈ క్రమంలోనే వర్మ తన ప్రత్యేకమైన శైలితో గతంలో మాదిరిగా మరోసారి తన సినిమా కలాన్ని పట్టుకుంటాడా? అనే అనుమానాలు, ఆశలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన తీసిన పలు సంచలనాత్మక సినిమాలు అలాంటివి.

ఫహద్ ఫాజిల్ వంటి నటుడు వర్మతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమైతే, అది పాన్ ఇండియా స్థాయిలో ఓ పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఫహద్ ను ఒప్పించడం అంటే మాములు విషయం కాదు. అతను కథ ఎంతో నచ్చితే గాని ఓకే చేయడు. ఇక వర్మ అయితే ప్రస్తుతం ఫామ్ లో లేడు. స్టార్స్ తో సినిమాలు చేయాలని కూడా అనికోవడం లేదు. కాబట్టి ఈ కాంబో లేనట్లే.