హీరోగా హిట్ పడ్డా విలన్ వేషాలు ఎందుకు..!
పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. పుష్ప 2 లో అంతకు మించి అన్నట్లుగా ఆయన పాత్ర ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 10 July 2024 7:38 AM GMTమలయాళ స్టార్ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు ఫహద్ ఫాసిల్ లు ఒక వైపు హీరోలుగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లో మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూ పాన్ ఇండియా స్టార్ నటులుగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు. ఫహద్ ఫాసిల్ తాజాగా మరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. పుష్ప 2 లో అంతకు మించి అన్నట్లుగా ఆయన పాత్ర ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో ఫహద్ నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.
ఇప్పటికే రజినీకాంత్ తో కలిసి 'వెట్టాయన్' సినిమాలో నటిస్తున్న ఫహద్ ఇంకా ఆ సినిమా విడుదల కూడా అవ్వకుండానే కూలీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒక వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న ఫహద్ ఇలా ఇతర హీరోల సినిమాల్లో విలన్ వేషాలు వేయాల్సిన అవసరం ఏంటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆవేశం సినిమాతో ఏకంగా వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఫహద్ హీరోగా కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అయినా కూడా తన విలన్ వేషాలు మరియు ముఖ్య పాత్రల్లో నటించడం మాత్రం మానుకోవడం లేదు. హీరోగా కంటే కూడా ఎక్కువగా నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు ఫహద్ ప్రయత్నిస్తున్నాడు.
మలయాళంతో పాటు అన్ని భాషల సినిమాల్లో కూడా హీరోగానే కాకుండా మంచి పాత్రతో వస్తే ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు రెడీ అన్నట్లుగా ఫహద్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే వరుసగా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు.