పుష్ప విలన్ ఫహద్‌కి అరుదైన వ్యాధి
మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రతిసారీ అద్భుతమైన నటనతో చర్చల్లో నిలుస్తున్నాడు
By: Tupaki Desk | 28 May 2024 6:11 AM GMTమలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రతిసారీ అద్భుతమైన నటనతో చర్చల్లో నిలుస్తున్నాడు. ఇంతకుముందు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు అతడు చాలా మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్సెస్ తో రక్తి కట్టించాడు. తన బ్లాక్ బస్టర్ మలయాళ గ్యాంగ్‌స్టర్ చిత్రం `ఆవేశం` ఇటీవల విడుదలైనప్పటి నుండి పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాడు. ఈ సినిమా దేశీయంగా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే తన వృత్తిపరమైన విజయాలను మించి, ఫహద్ తన ఆరోగ్య పరిస్థితిపై బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అతడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్నాడని వెల్లడించారు. ఈ వ్యాధి భారిన పడిన వారికి హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యలు ఉంటాయని తెలుస్తోంది.
ఇటీవలి ఒక ఈవెంట్‌లో జరిగిన ఇంటరాక్షన్‌లో ఫహద్ తాను అరుదైన రుగ్మతతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో ఫహద్ ఇలాంటి విషయాలను ఇతర సెలబ్రిటీలు బయటకు చెప్పాలని అన్నాడు. ఫహద్ ఫాసిల్ ధైర్యంగా తన వ్యక్తిగత పరిస్థితుల గురించి వెల్లడించాడు.
ఫహద్ నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్న తర్వాత కలిసి నిర్మాణ సంస్థను స్థాపించి ఉన్నత స్థాయి చిత్రాలను నిర్మించడం ద్వారా మలయాళ పరిశ్రమలో గొప్ప ప్రభావాన్ని చూపాడు. ట్రాన్స్, మాలిక్, విక్రమ్, జోజి వంటి చిత్రాలలో ఫహద్ నటనకు గొప్ప పేరొచ్చింది. 2024-25లో తదుపరి ప్రాజెక్ట్‌లలో పుష్ప 2: ది రూల్, మారేసన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తేవర్ మగన్ 2, ఆక్సిడెన్, పురాణనూరు ఉన్నాయి.