Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ ప్రాజెక్ట్.. ఎందుకు రిజెక్ట్ చేసినట్లు?

సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వస్తుందంటే యంగ్ హీరోలు ఎవరైనా వెంటనే నటించడానికి ఒకే చెప్పేస్తారు

By:  Tupaki Desk   |   10 July 2024 11:30 AM GMT
సూపర్ స్టార్ ప్రాజెక్ట్.. ఎందుకు రిజెక్ట్ చేసినట్లు?
X

సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వస్తుందంటే యంగ్ హీరోలు ఎవరైనా వెంటనే నటించడానికి ఒకే చెప్పేస్తారు. కచ్చితంగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసమే దర్శకులు ఎంపిక చేస్తారని అనుకుంటారు. అయితే కొంతమంది యాక్టర్స్ మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన కథ విన్న తర్వాత నచ్చితేనే చేస్తారు. లేదంటే మొహమాటం లేకుండా చేయమని చెప్పేస్తారు. సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి ఇలా చాలా ప్రాజెక్ట్స్ రిజక్ట్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిన కూడా క్యారెక్టర్ కనెక్ట్ కాకపోవడంతో చేయనని చెప్పేసింది. చిన్న హీరో మూవీ అయిన క్యారెక్టర్ నచ్చితే వెంటనే ఒకే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మల్లు యాక్టర్స్ చాలా మంది ఇలా కథల సెలక్షన్ విషయంలో పెర్ఫెక్ట్ గా ఉంటారు. కోలీవుడ్ హీరో ఫాహద్ ఫాజిల్ తాజాగా ఆవేశం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.

ఫాహద్ తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడు. ఆయన పాత్ర మూవీలో కీలకంగా ఉంటుంది. తమిళంలో కూడా గతంలో ఫాహద్ చాలా కొన్ని సినిమాలలో నటించాడు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే ఫాహద్ ఫాజిల్ ఆఫర్ ని రిజక్ట్ చేసారంట. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ తో కూలీ అనే మూవీ చేయబోతున్నారు.

ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అన్ని భాషలకి సంబందించిన క్యాస్టింగ్ ని లోకేష్ కనగరాజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. మూవీలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే ఫాహద్ ఫాజిల్ కి లోకేష్ ఆఫర్ చేసారంట. అయిన కూడా ఎందుకనో మూవీని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేక కూలీ మూవీ ఛాన్స్ ని ఫాహద్ వదులుకున్నాడా లేదంటే క్యారెక్టర్ నచ్చలేదా అనేది క్లారిటీ లేదు.

లియో మూవీ సక్సెస్ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కూలీ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ క్యాస్టింగ్ సెలక్షన్ ప్రస్తుతం జరుగుతుందంటే. ఆగష్టు నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ ఓ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది.