Begin typing your search above and press return to search.

మలయాళీ సినిమాల సక్సెస్ సీక్రెట్ ఇదే.. పుష్ప విలన్

విదేశీ భాషలలో కూడా కొన్ని మలయాళీ చిత్రాలు రీమేక్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   24 April 2024 4:31 AM GMT
మలయాళీ సినిమాల సక్సెస్ సీక్రెట్ ఇదే.. పుష్ప విలన్
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇతర భాషలతో పోల్చుకుంటే మలయాళీ ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఇదే ట్రెండ్ నడుస్తోంది. మలయాళంలో హిట్ అయిన సినిమాలని ఇతర భాషలలో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. విదేశీ భాషలలో కూడా కొన్ని మలయాళీ చిత్రాలు రీమేక్ అయ్యాయి. దృశ్యం మూవీ అయితే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతోంది.

మలయాళంలో సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన మంజిమల్ బాయ్స్, ప్రేమలు సినిమాలు ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మలయాళీ సినిమాలపై ప్రత్యేక అభిమానం పబ్లిక్ నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ వరకు అందరికి ఉంటుంది.

అయితే అక్కడ ఎందుకు సినిమాలు అంతగా సక్సెస్ అవుతాయనేది తాజాగా ఫాహద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలు రివీల్ చేశాడు. కేరళలో కొత్త కథలని చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. దీంతో దర్శకులు భిన్నమైన కథలని దృశ్యరూపంలో ఆవిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రెగ్యులర్ కథలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎంతోకొంత కొత్తదనం ఉంటే థియేటర్స్ కు వస్తున్నారు.

నటులు కూడా ప్రయోగాలకి పెద్దపీట వేస్తూ స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి కొత్త కథలలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ కారణంగా మలయాళంలో సినిమాలు ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి. ఆడియన్స్ చూసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే మనము ప్రయోగాలు చేయాలని ఫాహద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు. ఫాహద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాటితో చాలా మంది ఏకీభవిస్తున్నారు. కొత్తదనం ఉన్న కథలని, అలాగే రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీలని మలయాళంలో దర్శకులు ఎక్కువగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ నిర్మాతలు కూడా అలాంటి కొత్త కథలని ఎంకరేజ్ చేస్తున్నారు. అందరి సమిష్టి కృషి కారణంగా వారు సక్సెస్ లు ఎక్కువ అందుకుంటున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇతర ఇండస్ట్రీలు కూడా మలయాళం సినిమాలని ఫాలో అయితే అద్భుతమైన చిత్రాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈవెంట్ లో ఫాహద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అతను పుష్ప 2లో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఫాహద్ ఫాజిల్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు రావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.