అటు బచ్చన్.. ఇటు రజినీ.. మధ్యలో సైకో!
మలయాళీ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ఓ వైపు మాతృభాషలో మూవీస్ చేస్తూనే మరో వైపు ఇతర భాషలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 8 Aug 2024 11:28 AM GMTమలయాళీ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ఓ వైపు మాతృభాషలో మూవీస్ చేస్తూనే మరో వైపు ఇతర భాషలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మూవీతో ఫాహద్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. సైకో తరహా క్యారెక్టర్స్ తో అతను తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. పుష్ప ది రూల్ చిత్రంలో అతనే మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన షూటింగ్ కి సంబందించిన సన్నివేశాలు ఇంకా తెరకెక్కించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న వేట్టయాన్ సినిమాలో కూడా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. తమిళంలోకి శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన వెలైక్కారన్ సినిమాతో ఫాహద్ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ మూవీలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన విక్రమ్ సినిమాలో కూడా ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తమిళ్ తరువాత ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన మమనాన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఫాహద్ నటించాడు. ఈ ఏడాది మాతృభాషలో చేసిన ఆవేశం సినిమాతో ఫాహద్ ఫాజిల్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వేట్టయాన్ సినిమాలో ఫాహద్ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఫాహద్ ఫాజిల్ బర్త్ డే సందర్భంగా వేట్టయాన్ మూవీ షూటింగ్ సెట్ లో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫాహద్ ఫాజిల్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాహద్ కి విషెస్ తెలియజేసింది. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ తో టాలెంటెడ్ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కలిసి దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి కూడా వేట్టయాన్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్స్ అయిన ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం బాగుందని ఫాహద్ ఫాజిల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.