షెకావత్ గా ఫేమస్ అయినా ఛాన్సులు నిల్!
టాలీవుడ్ కి ఎంతో మంది విలన్లు వస్తుంటారు? పోతుంటారు? కానీ ఈ సార్ మాత్రం కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయేలే ముద్ర వేసారు.
By: Tupaki Desk | 20 May 2024 2:45 AM GMT'పుష్ప'తో మాలీవుడ్ నటుడు పహాద్ ఫాజిల్ ఎంత టాలీవుడ్ లో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. బన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. వైవిథ్యమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. టాలీవుడ్ కి ఎంతో మంది విలన్లు వస్తుంటారు? పోతుంటారు? కానీ ఈ సార్ మాత్రం కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయేలే ముద్ర వేసారు. మరి ఆ ఐడెంటిటీని పహాద్ ని నటుడిగా ఇక్కడ బిజీ చేసిందా? అంటే లేదనే చెప్పాలి.
'పుష్ప' సక్సెస్ తర్వాత పహాద్ తెలుగు అగ్ర హీరోల చిత్రాల్లో ప్రధాన విలన్ అవుతాడని అంతా ఊహించారు. కానీ అలా జరగలేదు. పుష్ప-2 తప్ప ఆయన చేతిలో మరో తెలుగు సినిమా లేదు. బాలీవుడ్ నుంచి ఎంతో మంది నటులు విలన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు గానీ! షెకావత్ సార్ కి మాత్రం ఆ రకమైన ఛాన్సులు రానట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో ఒకటి..రజనీకాంత్ వెట్టేయాన్ మరొకటి. ఈ రెండు తప్ప పహాద్ కొత్త సినిమాలకు సైన్ చేసింది లేదు.
పుష్ప విజయం తర్వాత మాలీవుడ్ లో మాత్రం ఆవేశం లాంటి సినిమాతో 150 కోట్ల హీరో అయ్యారు. మరి ఈ నయా హీరోకి తెలుగులో అవకాశాలు రావడం లేదా? లేక వచ్చినా సెలక్టివ్ గా ఉండటంతో కోల్పోతున్నాడా? అంటే గతంలో ఆయన పాత్రల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటానని చెప్పారు. ఏ పాత్ర అయినా తనకు నచ్చితే తప్ప ఒప్పుకోనన్నారు. సినిమా ఇండస్ట్రీకి రాకముందే తాను తీసుకున్న నిర్ణయంగా చెప్పారు.
వాస్తవానికి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ అవకాశాలు రావడంతో కంటున్యూ అయ్యారు. టాలీవుడ్ లో మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. పహాద్ లాంటి నటుడికి ఇక్కడ అవకాశాలు రాకపోవడం అంటూ ఉండదు. ఆయనతో పని చేయాలని స్టార్ హీరోలే ఆసక్తి చూపిస్తుంటారు. అవకాశాలు రాక కాదు పాత్రలు నచ్చకే దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తుంది. అలా సెలక్టివ్ గా ఉన్నారు కాబట్టే యూనిక్ పెర్పార్మర్ గా గుర్తింపు దక్కించుకున్నారు.